వకీల్‌ సాబ్‌లో రేణూ దేశాయ్.. క్లారిటీ ఇచ్చేసిందిగా..!!

March 26, 2020 at 3:13 pm

గ‌త‌ రెండేళ్లగా సినిమాల‌కు దూరంగా ఉంటున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ళ్లీ ముఖానికి రంగు వేసుకుని రీఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. ‘దిల్‌’ రాజు నిర్మాణంలో శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న వకీల్ సాబ్ చిత్రంతో ప‌వ‌న్ సిల్వ‌ర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రం బాలీవుడ్‌లో సూప‌ర్ హిట్టైన అయితే `పింక్‌` చిత్రానికి రీమేక్‌. ఇందులో అంజలి, నివేతా థామస్, అనన్య పాండే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక వకీల్ సాబ్ చిత్రాన్ని మే 15న విడుదల తేదీ ఖరారు చేసుకుంది.

అందుకు అనుగుణంగానే జెట్ స్పీడులో ఈ సినిమాని పూర్తి చేస్తున్నాడు స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌ రాజు. అయితే క‌రోనా కార‌ణంగా ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ప‌డింది. ఇదిలా ఉంటే.. గ‌త కొన్ని రోజులుగా వ‌కీల్‌ సాబ్ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ న‌టిస్తుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాజాగా రేణూ దేశాయ్ దీనిపై క్లారిటీ ఇచ్చింది.

‘ఇది పచ్చి అబద్ధం. ఎవరో రూమర్లు స్టార్ట్‌ చేస్తారు.. అసలు రూమర్లు స్టార్ట్‌ చేసే ఇంత సమయం వారికి ఎలా ఉంటుంది. ఇటువంటి వారి తీరుని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది’ అని తెలిపారు. ఏదేమైనా వ‌కీల్ చిత్రంలో అయితే రేణూ దేశాయ్ న‌టించ‌డం లేదు. కాగా, కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని, ఇంట్లో పెద్ద వారిని బాగా చూసుకోవాలని రేణూ దేశాయ్ సూచించింది.

వకీల్‌ సాబ్‌లో రేణూ దేశాయ్.. క్లారిటీ ఇచ్చేసిందిగా..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts