రోజాపై నెటిజ‌న్ల సెటైర్లు.. దారుణ‌మైన ట్రోల్స్‌

March 17, 2020 at 3:49 am

వైసీపీ ఎమ్మ‌ల్యే ఆర్కే రోజా ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. తన వ్యాఖ్య‌ల‌తో, వ్యంగ్యాస్ర్తాల‌ను సంధిస్తూ.. వెరైటీ పేర్ల‌తో విప‌క్ష టీడీపీ నేత‌ల‌ను, చంద్ర‌బాబును, లోకేష్‌ను దుమ్మెత్తిపోస్తూ వార్త‌ల్లో నిలుస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా ఈ సారి ఈ న‌టియే నెటిజ‌న్ల ట్రోల్స్ భారిన ప‌డ‌డం కాస్తా విచిత్రంగా ఉన్న‌ది. సోష‌ల్‌మీడియాలో దారుణ‌మైన విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటున్నారు. ప్ర‌స్తుతం రోజా. అంటీ అవ‌స‌ర‌మా అంటూ కొంద‌రు కామెంట్ చేస్తుంటే.. మ‌రికొంద‌రూ మీమ్స్‌తో త‌మ అభిప్రాయాల‌ను తెలుపుతూ రోజాపై వ్యంగ్యాస్ర్తాల‌ను సంధించ‌డం గ‌మ‌నార్హం. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే..

నగరికి ఎమ్మెల్యే అయినా రోజా న‌టిగా తెలుగు, తమిళ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసి స్టార్ హీరోయిన్‌గా విరిజిల్లింది. ప్ర‌స్తుతం జబర్దస్త్లో నవ్వుల రోజాలు విసురుతోంది. జడ్జిగా ఈ షోని సింగిల్ హ్యాండ్‌తో నడిపిస్తున్న రోజా తాజాగా ఉగాది పండగ సందర్భంగా ‘పండగ సార్.. పండగ అంతే’ అంటూ స్పెషల్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నారు. ఆ ప్రోగ్రాముకు సంబంధించి ప్రోమోలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా రోజా. శేఖర్ మాస్టర్‌తో కలిసి సామజవరగమన సాంగ్‌కి అదిరిపోయే స్టెప్పులు వేసిన ప్రోమోను ఇటీవ‌లే విడుద‌ల చేశారు. తన హావభావాలతో హొయలొలికించడమే కాదు.. మాస్ స్టెప్పులతో రచ్చ లేపారు ఈ ఎమ్మెల్యే. అయితే వీటికి చూసి ఆనందపడే వారికంటే విమ‌ర్శ‌ల‌ను గుప్పిస్తున్న‌వారే ఎక్కువ‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం. వారిద్ద‌రిపై దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు ట్రోలింగ్ బ్యాచ్. నెటిజ‌న్లు పెట్టే కొన్ని మీమ్స్ నవ్వు పుట్టించేవిగా ఉంటే.. మరికొన్ని మంటపుట్టించేవిగానూ ఉన్నాయి. మ‌రి వీటిపై ఈ ఎమ్మెల్యే స్పందిస్తారో?

రోజాపై నెటిజ‌న్ల సెటైర్లు.. దారుణ‌మైన ట్రోల్స్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts