రౌద్రం ర‌ణం రుధిరం టైటిల్‌తో మోష‌న్ పోస్ట‌ర్ దుమ్మురేపుతోంది

March 25, 2020 at 12:36 pm

రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న ఆర్‌.ఆర్‌.ఆర్‌. ఈ చిత్రం మోష‌న్ పోస్ట‌ర్‌ను ఈ రోజు ఉగాది సంద‌ర్భంగా విడుద‌ల చేశారు. డీవీవీ ఎంట‌ర్టైన్ మెంట్ బ్యాన‌ర్‌పై డీవీవీ దాన‌య్య నిర్మిస్తోన్న ఈ చిత్రం ఇప్ప‌టికే యేడాదికి పైగా షూటింగ్ జ‌రుపు కుంటోంది. టాలీవుడ్ యంగ్ హీరోలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌లిసి న‌టిస్తోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమ‌రం భీం గాను… రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగాను న‌టిస్తున్నారు.

గిరిజన నాయ‌కుడిగా ఉన్న కొమ‌రం భీం అప్ప‌టి నైజాం అరాచ‌కాల‌పై పోరాటం చేశాడు. ఇక అల్లూరి సీతారామ‌రాజు అప్ప‌టి బ్రిటీష్ దొర‌ల‌పై పోరాటం చేశాడు. వీరిద్ద‌రికి ఉన్న కామ‌న్ పాయింట్ గిరిజ‌నుల‌ను ఏకం చేసి ఫైట్ చేయ‌డ‌మే. ఇక ఈ ఉగాది రోజున ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో విల‌న్‌గా న‌టిస్తోన్న అజ‌య్ దేవ‌గ‌న్‌ పాత్ర పై కూడా భారీ అంచ‌నాలు ఉన్నాయి.

ఈ చిత్రం టైటిల్ ని రివీల్ చేస్తూ…ఈ పోస్ట‌ర్‌ని లాంచ్ చేశారు. రౌద్రం ర‌ణం రుధిరం టైటిల్‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఇక మోష‌న్ పోస్ట‌ర్ చాలా భీక‌రంగా ఉండేలా డిజైన్ చేశారు. ఈ సినిమా ఇప్ప‌టికే వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 8న వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించారు. తాజాగా టైటిల్ రివీల్‌తో సినిమాపై అదిరిపోయేచే అంచ‌నాలు ఉన్నాయి. మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ అయ్యిందే లేదో యూట్యూబ్‌లో ఓ రేంజ్‌లో అప్పుడే వ్యూస్ వ‌చ్చేస్తున్నాయి.

రౌద్రం ర‌ణం రుధిరం టైటిల్‌తో మోష‌న్ పోస్ట‌ర్ దుమ్మురేపుతోంది
0 votes, 0.00 avg. rating (0% score)