`ఆర్ఆర్ఆర్‌` టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ వ‌చ్చేసింది..!!

March 25, 2020 at 12:23 pm

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మన్యం వీరుడు అల్లూరి, గిరిజన వీరుడు కొమరం భీమ్‌ల జీవితకథతో ఓ ఫిక్షనల్‌ కథగా జక్కన్న దీన్ని చెక్కుతోన్న సంగతి తెలిసిందే. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాలో రాంచరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా హాలీవుడ్ ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఇప్ప‌టికే దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని వ‌చ్చే సంవ‌త్స‌రం సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేయ‌నున్నారు. ఇక‌ ఇప్పటి వరకు ఈ ‘ఆర్ఆర్ఆర్’ అంటే ఏమిటో జక్కన్న ప్రకటించలేదు. అయితే ఉగాది సందర్భంగా ఆర్ఆర్ఆర్ టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ లను రిలీజ్ చేస్తున్నామని ఆ సినిమా బృందం ట్వీట్ చేసింది. ‘ఎదురు చూపులు ముగిశాయి. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు లోగో, మోషన్ పోస్టర్ లను రిలీజ్ చేస్తున్నాం’ అని ట్విట్టర్‌లో పేర్కొంది.

ఆ టైమ్ రానే వ‌చ్చేసింది. ఆర్ఆర్ఆర్ టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ లను ఆ సినిమా బృందం విడుదల చేసింది. పలు భాషల్లో సైతం ఆర్ఆర్ఆర్ టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ లను విడుదల చేశారు. ఈ సినిమాకు ‘రౌద్రం.. రుధిరం.. రణం’ పేరు ఖ‌రారు చేశారు. ఇందులో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్స్ కూడా విడుదల చేసాడు దర్శక ధీరుడు. మంటల్లోంచి జూనియర్ ఎన్టీఆర్ వస్తుంటే.. నీళ్ళలో నుంచి రామ్ చరణ్ వచ్చాడు. ఈ ఇద్దరూ చివరికి చేయి చేయి కలిపినపుడు రౌద్రం రణం రుధిరం అని పడుతుంది.

`ఆర్ఆర్ఆర్‌` టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ వ‌చ్చేసింది..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts