చ‌ర‌ణ్ బ‌న్నీ ఫ్యాన్స్‌కి ఆర్‌.ఆర్‌.ఆర్‌. మోష‌న్ పోస్ట‌ర్ నిరాశేన‌ట‌?

March 25, 2020 at 6:08 pm

ఉగాది సంద‌డి అనేది ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఎవ‌రు చూసినా భ‌యభ్రాంతుల‌తో ఏదో అలా కాలాన్ని గ‌డుపుతున్నారు. మ‌రి ఆ టెన్ష‌న్ ఏంతో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. గ‌త రెండు నెల‌లుగా క‌రోనా వైర‌స్‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా టెన్ష‌న్‌ మొద‌లైంది. ఇది ఈ మ‌ధ్య ఓ 15 రోజుల నుంచి మ‌రింత పెరిగింది. ఇంత టెన్ష‌న్‌లో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి త‌న కొత్త చిత్రం ఆర్‌.ఆర్‌.ఆర్ నుంచి కొన్ని నిమిషాల క్రింద‌ట‌నే ఓ మోషన్ పోస్ట‌ర్ ని విడుద‌ల‌చేశారు.

ప్ర‌స్తుతం ఆ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. అయితే జక్కన్న ఏది చేసినా పక్కా ప్లాన్ ప్ర‌కారం చాలా తెలివిగా వెళుతుంటాడు. కానీ, ఈసారి మాత్రం ఆయన ఎక్కడో కాస్త తేడా కొట్టేశాడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.. అదేంటి వనుకుంటున్నారా… ప్రపంచం అంతా భయపడుతున్న వేళ.. తన కొత్త చిత్రం అప్ డేట్ టీజ‌ర్‌ని విడుద‌ల చేయ‌డం అనేది ఒక వివాదానికి తావిస్తే… రాజ‌మౌళి ఈ సినిమా గురించి ఏ అప్ డేట్ అయినా స‌రే ప్రేక్ష‌కుల్లో ఇటు ఫ్యాన్స్‌లో, అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో హ‌డావిడి మాములుగా ఉండ‌దు. అయితే ఈ సారి మాత్రం అలాంటి హ‌డివిడి ఏమీ లేదు. ఈ సినిమా టైటిల్ రాజ‌మౌళి ఎప్పుడెప్పుడు చెపుతాడా అని అంత‌టా ఆశ‌క్తి నెల‌కొన్ని విష‌యం తెలిసిందే. ఉగాది సందర్భంగా, ఈనెల 27న రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా టైటిల్ ని ప్రకటించింది చిత్రబృందం.

రౌద్రం, ర‌ణం, రుధిరం అనే టైటిల్ తో ఈ మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌వ‌గా ఇది ఆశించినంత‌గా ఫ్యాన్స్‌ని ఆక‌ట్టుకోలేద‌ట‌. అయితే ఈ పోస్ట‌ర్‌లో అస‌లు ఎవ‌రిని చూపిస్తున్నారు అన్న‌ది కూడా క్లియ‌ర్‌గా లేదు. ఎన్టీఆర్, లేక రామ్‌చ‌ర‌ణా అన్న‌ది క్లారిటీ లేద‌ని ఫ్యాన్స్ గోల చేస్తున్నారు. అంతేకాక అసలు ఈ పోస్ట‌ర్‌లో రాజ‌మౌళి మార్క్ ఎక్క‌డా క‌నిపించ‌లేదంటున్నారు. ఇక ఎవ‌రిని హైలెట్ చేసి చూపించినా మిగ‌తావారితో గొడ‌వ‌నుకున్నారో ఏమో గాని రాజ‌మౌళి మొత్తానికి పోస్ట‌ర్ మాత్రం పెద్ద క్లారిటీగా అయితే లేదు. అలాగే టైటిల్ రివీల్ పైన కూడా కాస్త నిరాశ‌గానే ఉన్నారు. టైటిల్ కూడా పెద్ద‌గా ఎవ‌రికీ న‌చ్చ‌లేద‌ట‌. ఇంత కాలం వెయిట్ చేసింది ఇలాంటి టైటిల్ కోస‌మా అన్న‌ట్లు విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ చిత్రంలో విల‌న్ పాత్ర‌లో అజ‌య్‌దేవ‌గ‌న్ అనుకున్నాడు రాజమౌళి. కాని ఆయ‌న మ‌రో కీల‌క‌పాత్ర‌లో చూపిస్తార‌ని స‌మాచారం.

చ‌ర‌ణ్ బ‌న్నీ ఫ్యాన్స్‌కి ఆర్‌.ఆర్‌.ఆర్‌. మోష‌న్ పోస్ట‌ర్ నిరాశేన‌ట‌?
0 votes, 0.00 avg. rating (0% score)