మీగోల మీదే త‌ప్పించి జ‌నాల ఎమోష‌న్స్‌తో సంబంధం లేదా?

March 25, 2020 at 1:51 pm

గ‌త రెండు నెల‌లుగా క‌రోనా వైర‌స్‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా టెన్ష‌న్ మొద‌లైంది. ఈ మ‌ధ్య ప‌రిస్థితులు మ‌రింత ఘోరంగా త‌యార‌యింది. ఇంట్లోంచి అడుగు బ‌య‌ట పెట్ట‌డానికి లేనంత టెన్ష‌న్‌లో జ‌నాలు బ్ర‌తుకుతున్నారు. ఇంత టెన్ష‌న్‌లో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి త‌న కొత్త చిత్రం ఆర్‌.ఆర్‌.ఆర్ నుంచి కొన్ని నిమిషాల క్రింద‌ట‌నే ఓ మోషన్ పోస్ట‌ర్ ని విడుద‌ల‌చేశారు.

ఆ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. జక్కన్న తెలివిగా తన కొత్త చిత్రం అప్ డేట్ న్యూస్ మోష‌న్ పోస్ట‌ర్ టీజ‌ర్‌ని విడుద‌ల చేయ‌డం అనేది కాస్త వివాదానికి దారితీస్తుంది. అదేమిటి అనుకుంటున్నారా… ప్ర‌పంచ‌మంతా ఈ వైర‌స్‌తో అత‌లాకుత‌లం అవుతున్న సంద‌ర్భంగా ఈ పోస్ట‌ర్ విడుద‌ల పై పెద్ద‌గా ఏమీ స్పంద‌న లేదు. అంటే రాజ‌మౌళి ఈ సినిమా గురించి ఏ అప్ డేట్ అయినా స‌రే ప్రేక్ష‌కుల్లో ఇటు ఫ్యాన్స్‌లో, అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో హ‌డావిడి మాములుగా ఉండ‌దు. ఈ సినిమా టైటిల్ రాజ‌మౌళి ఎప్పుడెప్పుడు చెపుతాడా అని అంత‌టా ఆశ‌క్తి నెల‌కొన్ని విష‌యం తెలిసిందే. ఉగాది సందర్భంగా, ఈనెల 27న రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా టైటిల్ ని ప్రకటించింది చిత్రబృందం. అయితే ఇలాంటి సమయంలో… సినిమా ప్రచారాలు అవసరమా? అనే చర్చలు మొద‌ల‌య్యాయి. ఓ ప‌క్క భయంతో ప్రపంచం వణికిపోతోంటే.. అవేం పట్టనట్టు సినిమా ప్రచారం చేసుకోవడం హర్షించదగిన విషయం కాద‌ని సోష‌ల్ మీడియాలో చ‌ర్చ మొద‌ల‌యింది. ఇటీవల ప్రపంచం అంతా వణికిపోతున్న వేళ మోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూకి టాలీవుడ్ సెలబ్రిటీలు వాళ్ళు చేసే ప‌నులు, వీడియోలు రిలీజ్ చేస్తే… రాజమౌళి ఏమీ ఆలోచించ‌కుండా ఈ చిత్రం గురించి మీడియా ముందుకు వ‌చ్చి ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్ గురించి ఒక చిన్న మెసేజ్ కూడా పంప‌కుండా తన పనిలో తాను బిజీగా ఉండ‌ట‌మే కాదు.

ఇప్పుడు జ‌నాలంతా ఖాళీగా ఉండ‌టంతో త‌న సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. అని ఆయ‌న విడుద‌ల చేశారు. జ‌నాల ఆలోచ‌న‌లు, అవ‌స‌రాల‌తో వాళ్ళ ఎమోష‌న్స్ తో సంబంధం లేకుండా ఈయ‌న త‌న సినిమా ప్ర‌మోష‌న్‌ని చేసుకున్నారు.

మీగోల మీదే త‌ప్పించి జ‌నాల ఎమోష‌న్స్‌తో సంబంధం లేదా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts