టైటిల్ విష‌యంలో ‘ఆర్ఆర్ఆర్‌’ టీమ్‌కు బిగ్ షాక్..!!

March 13, 2020 at 5:57 pm

‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ హీరోలుగా భారీ మల్టీస్టారర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరు చారిత్రక యోధులైన ఆంధ్రా ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజు, తెలంగాణకు చెందిన కొమరం భీమ్‌లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కాల్పనిక కథతో.. రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తుండంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ 80 శాతం కంప్లీటైంది. అయినా ఇప్పటికీ దీని టైటిల్ ఏమిటన్న విషయంపై స్పష్టత లేదు. అయితే ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’కు మంచి టైటిల్‌ను ప్రేక్షకులు సూచించాలని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటిల్లో కొన్ని టైటిల్స్‌కు మంచి స్పందన వచ్చింది. అవి ‘రామ రావణ రాజ్యం’, ‘రఘుపతి రాఘవ రాజారామ్’. ఈ రెండింటిలో రఘుపతి రాఘవ రాజారాం అనే టైటిల్‌ను ఫైనల్ చేశాడ‌ట జ‌క్క‌న్న‌. ఈ క్ర‌మంలోనే ఆ టైటిల్‌ను రిజిస్టర్‌ చేయించడం కోసం ఫిలింనగర్‌కు వెళ్లిన రాజమౌళి టీమ్‌కు షాక్ ఎదురైందట.

అదేంటంటే.. అప్పటికే ఈ టైటిల్‌ను మరో మూవీ నిర్మాతలు రిజిస్ట్రర్ చేయించారట. ఈ నేపథ్యంలో వారిని కలిసిన ఆర్ఆర్ఆర్ టీమ్.. రఘుపతి రాఘవ రాజారాంకు తాము తీసుకుంటామని.. అందుకు డబ్బులు చెల్లిస్తామని చెప్పారట. అయితే సదరు నిర్మాతలు ఆర్ఆర్ఆర్ టీమ్ నుంచి టైటిల్ కోసం భారీ డబ్బును డిమాండ్ చేశారట. బేరాసారాలు ఆడినప్పటికీ.. వారు వెనక్కి తగ్గలేదట. దీంతో ఆర్ఆర్ఆర్ టీమ్ వెనుదిరిగిందట. మ‌రి జ‌క్క‌న్న ఈ చిత్రానికి ఏం టైటిల్ పెడ‌తార‌న్న చ‌ర్చ‌లు మ‌రోసారి హాట్ టాపిక్‌గా మారింది.

టైటిల్ విష‌యంలో ‘ఆర్ఆర్ఆర్‌’ టీమ్‌కు బిగ్ షాక్..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts