ఆ హీరోతో సానియా మీర్జా ఎఫైర్‌… ?

March 17, 2020 at 5:46 pm

సానియా మీర్జా పేరు తెలియని భారతీయులు ఉండరు. టెన్నిస్ క్రీడాకారిణిగా ఎన్నో విజయాలతో మన దేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు సాధించిపెట్టిన సానియా ఆటతో పాటు అందంతో కూడా అందరినీ ఆకర్షిస్తూ ఉంటారన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. సానియా తన ఆటతీరుతో ఎలా వార్తల్లో నిలిచారో ? తన వ్యక్తిగత విషయాల‌తో కూడా ఆమె అంతే స్థాయిలో వార్తల్లోకెక్కారు. దీంతో ఆమె వ్యక్తిగత జీవితం గురించి రకరకాల వార్తలు మీడియాలో హల్ చల్ చేశాయి. గతంలోనే సానియా టాలీవుడ్‌కు చెందిన ఒక హీరోతో సన్నిహితంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇక గ‌తంలో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తో ఆమె లవ్ ట్రాక్ న‌డిపారు అనే అంశంపై ఆమె తన తాజా ఇంటర్వ్యూలో స్పందించారు.

బాలీవుడ్ నిర్మాత కరుణ్ జోహార్ సానియా మీర్జాను ఇంటర్వూ చేశారు. ఈ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న షాహిద్‌తో ఎఫైర్ నిజ‌మేనా ? అని ప్ర‌శ్నిస్తే అప్ప‌టి విష‌యాలు త‌న‌కు గుర్తు లేవు అంటూనే ప‌రోక్షంగా షాహిద్‌ను ప్రేమించాన‌ని చెప్పిందా ? అన్న డౌట్లు వ‌చ్చేలా ఆమె మాట్లాడారు. గ‌తంలో వీరిద్దరూ కొంతకాలం ప్రేమించుకున్నారని ప్రచారం జరిగింది. హాహిద్ తో బ్రేకప్ తరువాత సానియాకు ఓ వ్యక్తితో ఎంగేజ్ మెంట్ కావడం ఆ తరువాత అది క్యాన్సిల్ అవ్వడం జరిగింది. అనంతరం సానియా పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ని ప్రేమ వివాహాం చేసుకుంది.

ఇక అటు షాహిద్ క‌పూర్ సైతం ప‌లువురు బాలీవుడ్ హీరోయిన్ల‌తో ఎఫైర్ న‌డిపారు. ఈ లిస్టులో క‌రీనా క‌పూర్‌దే అగ్ర‌స్థానం. వీరిద్ద‌రు కూడా పెళ్లి వ‌ర‌కు వెళ్లార‌నుకుంటున్న టైంలోనే విడిపోయారు. అప్పుడు క‌రీనా సైఫ్ ఆలీఖాన్‌ను పెళ్లి చేసుకుంది.

ఆ హీరోతో సానియా మీర్జా ఎఫైర్‌… ?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts