సెల్ఫ్ క్వారంటైన్ లో శృతి హాసన్ చిందులు ..!

March 26, 2020 at 10:09 am

రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవ‌లె విదేశాల నుంచి వ‌చ్చి సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్న సంగతి తెలిసిందే. కరోనా ఎఫెక్ట్ తో విదేశాల నుండి షూటింగ్ నిమితం వెళ్ళి తిరిగి వచ్చారు. ఆ ప్రభావం ఉండకుండా ప్రభాస్ స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఇదే విషయాన్ని ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు కేంద్రానికి తెలిపారు. ఇక ఇదే నిర్ణయాన్ని హీరోయిన్ శృతి హాసన్ కూడా తీసుకున్నారు. 10 రోజుల కిందటే లండన్ నుంచి వచ్చిన హీరోయిన్ శృతిహాసన్ కి ఎయిర్ పోర్ట్ లో స్క్రీనింగ్ కూడా నిర్వహించారు. చేతికి సెల్ఫ్ క్వారంటైన్ (స్వీయ నిర్బంధం) ముద్ర కూడా వేశారు. ప్రస్తుతం ఆమె ఇంటి నుంచి బయటకు రావడం లేదు.

ఇక ఇలా ఏకాంతంగా గడపడం నాకు కొత్తేం కాదు. ఈ క్వారంటైన్ టైమ్ లో నేను కుకింగ్, బేకింగ్ చేయడంతో పాటు ఆర్గానిక్ సబ్బులు కూడా తయారు చేస్తున్నాను. ఇంట్లో ఇలా మరో ఆప్షన్ లేకుండా ఉండడం కాస్త ఇబ్బంది అనిపిస్తున్నప్పటికీ.. బయట ఏం జరుగుతుందో అనే భయంతో పోలిస్తే ఇది చాలా చిన్న విషయం అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

అంతేకాదు శృతిహాసన్ తో పాటు తండ్రి కమల్ హాసన్, చెల్ల్ అక్షర హాసన్ కూడా విదేశాలకు వెళ్లి వచ్చారు. దీంతో వాళ్లు కూడా సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నారు. ఒకరినొకరు కలుసుకోకుండా అంతా వేర్వేరు ఇళ్లల్లో ఉంటున్నామని శృతిహాసన్ తెలిపింది.

ఇక ప్రస్తుతం కరోనా మహమ్మారితో ప్రపంచం లోని దేశాలన్ని అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. అందుకే ప్రధాన మంత్రి, ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రులు కఠినమైన నిర్ణయాలని తీసుకుంటున్నారు. లాక్ డౌన్ పేరుతో రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. విదేశాల నుండి ఎవరైనా వస్తే వాళ్ళని క్వారంటైన్ లో ఉంచుతున్నారు. కరోనా లేదని తేలిన తర్వాతే బయటకి వస్తున్నారు. ప్రస్తుతం ప్రతీ ఒక్కరు ఇంట్లోనే ఉండాలని గడప దాటరాదని ఏ ఆరోగ్య సమస్యలు తలెత్తినా 100 మీ ఇంటి వద్దకే వస్తుందని ముఖ్య మంత్రి కె.సి.ఆర్ వెళ్ళడించారు.

సెల్ఫ్ క్వారంటైన్ లో శృతి హాసన్ చిందులు ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts