సింగీతం పట్టుకొస్తున్న సింగర్.. ఎవరో తెలుసా?

March 19, 2020 at 10:57 am

టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్టింగ్ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచిన సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ రావు గురించి అందరికీ తెలిసిందే. ఆదిత్య 369, భైరవద్వీపం, పుష్పకవిమానం, అపూర్వ సహోదరులు వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌ను తెరకెక్కించిన సింగీతం తనదైన ముద్రను సినీ ఇండస్ట్రీపై వేశారు. కాగా గతకొంత కాలంగా ఎలాంటి సినిమాలు తీయని సింగీతం మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు.

ప్రస్తుతం సినిమాల్లో బయోపిక్‌ చిత్రాల హవా నడుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ మొదలు, టాలీవుడ్, కోలీవుడ్‌లలోనూ బయోపిక్ చిత్రాలకు అదిరిపోయే ఆరరణ లభిస్తుండటంతో సింగీతం శ్రీనివాస్ రావు కూడా ఇదే దారిలో పయనించేందుకు సిద్ధమయ్యారు. కాగా ఓ ప్రముఖ సింగర్‌ జీవితాన్ని బయోపిక్ చిత్రంగా తెరకెక్కించేందుకు సింగీతం రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించిన స్క్రిప్టు పనులు కూడా ఆయన వేగంగా చేస్తున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి ఓ బయోపిక్ చిత్రంతో సింగీతం మరోసారి మనముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. మరి ఈ సినిమాలో ఎవరి జీవితాన్ని మనకు చూపిస్తాడనే అంశం మాత్రం ప్రస్తుతానికి సీక్రెట్‌గా ఉంచారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

సింగీతం పట్టుకొస్తున్న సింగర్.. ఎవరో తెలుసా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts