చెల్లి.. చెల్లి అంటూ ద‌గ్గ‌ర‌య్యాడు.. అద‌ను చూసి కామ‌వాంఛ తీర్చ‌లేద‌నీ..!

March 6, 2020 at 3:56 am

కామాంధులు రోజుకో తీరుగా మ‌హిళ‌ల‌పై తెగ‌బ‌డి దాడులు చేస్తున్నారు. ఎవ‌రిని న‌మ్మాలో, ఎవ‌రిని న‌మ్మ‌కూడ‌దో తెలియ‌ని దుస్థితి నెల‌కొంది. ఇంటా.. బ‌య‌టా ర‌క్ష‌ణ లేకుండా పోతున్న‌ది. న‌మ్మ‌కంగా మెదిలిన‌వారే తీరా మృగాళ్లుగా మారుతున్నారు. మీద‌ప‌డి ప‌శువాంఛ తీర్చ‌కుంటున్నారు. కుద‌ర‌క‌పోతో పైశాచికంగా హ‌త‌మార్చుతున్నారు. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుందీ ఘ‌ట‌న‌. చెల్లి.. చెల్లి అంటూ యువ‌తితో చ‌నువు పెంచుకున్న ఓ మృగాడు. అదును చూసి అత్యాచారానికి తెగ‌బ‌డ్డాడు. యువ‌తి ప్ర‌తిఘ‌టించడంతో ఏకంగా గొంతు కోశాడు. ఈ దారుణ సంఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ర్టంలో వెలుగుచూసింది. వివార‌ల్లోకి వెళ్లితే..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ర్టం ఆగ్రా ప‌ట్ట‌ణం తాజ్‌గంజ్ ప్రాంతానికి చెందిన ఓ యువ‌కుడు అదే ప్రాంతానికి చెందిన యువ‌తిపై ఎప్ప‌టి నుంచో క‌న్నేశాడు. ఆ కుటిల‌బుద్ధిని మ‌న‌సులోనే పెట్టుకుని పైకి మాత్రం చెల్లి చెల్లి అంటూ ఆమెకు ద‌గ్గ‌ర‌య్యాడు. ఆప్యాయంగా పిలుస్తుండ‌డంతో స‌ద‌రు యువ‌తి సైతం యువ‌కుడిని ఎంత‌గానో అభిమానించ‌సాగింది. ఇటీవ‌ల స‌ద‌రు యువ‌తి ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యాన్ని చూసి త‌న నిజ‌స్వ‌రూపాన్ని బ‌య‌ట‌పెట్టాడు. ఆమెపై లైంగిక దాడికి య‌త్నించాడు. ఒక్క‌సారిగా ఆ యువ‌కుడి ప్ర‌వ‌ర్త‌న‌తో కంగుతిన్న‌ది. అనంత‌రం యువ‌కుడిని ప్ర‌తిఘ‌టించింది. అంతే స‌ద‌రు యువ‌కుడు కోపంతో క‌త్తితో ఆమె గొంతును కోసి పారిపోయేందుకు య‌త్నిస్తుండ‌గా, అప్ప‌టికే యువ‌తి కేక‌లు విన్న చుట్టుపక్కల స్థానికులు అక్క‌డి నుంచి రావడంతో బెంబేలెత్తిపోయాడు. దీంతో అదే క‌త్తితో కోస‌కుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించ‌గా వారు హుటాహుటిన అక్క‌డికి చేరుకుని వారిద్ద‌రినీ వైద్య‌శాల‌కు తరలించారు. వివ‌రాలు సేక‌రించి నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అధికారులు.

చెల్లి.. చెల్లి అంటూ ద‌గ్గ‌ర‌య్యాడు.. అద‌ను చూసి కామ‌వాంఛ తీర్చ‌లేద‌నీ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts