అక్ర‌మ సంబంధం పెట్టుకున్న చెల్లెలు.. ప్రాణం తీసిన సోద‌రులు

March 14, 2020 at 4:02 am

వివాహేతర సంబంధాలు ఎన్నో దారుణాల‌కు కార‌ణాలుగా నిలుస్తున్నాయి. హ‌త్య‌ల‌కు, ఆత్మ‌హ‌త్య‌కు హేతువుగా మారుతున్నాయి. ప‌రాయ వ్య‌క్తుల మోజు చివ‌ర‌కు ప్రాణాల‌ను బ‌లిగొంటున్న‌ది. ఇలాంటి ఘ‌ట‌న‌లు నిత్యం ఎక్క‌డో ఒక చోట వేలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా మ‌రో సంఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న మహిళ ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ విషయం తెలిసిన సోద‌రులు ఆమెతీవ్రంగా హింసించి చంపేశారు. పోలీసులు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం..

ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ర్టం ముజఫర్‌నగర్‌ సమీపంలోని కోకడ గ్రామానికి చెందిన ఓ మహిళ భ‌ర్త‌ రెండేళ్ల క్రితం చనిపోయాడు. దీంతో ఆమె తిరిగి త‌న పుట్టింటికి చేరుకున్న‌ది. అన్న‌ద‌మ్ముల‌తో క‌లిసి నివ‌సిస్తున్న‌ది. ఇదిలా ఉండ‌గా ఆమెకు అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. అదికాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ విషయాన్ని పసిగట్టిన మహిళ సోదరులు ప‌లుమార్లు వారిద్ద‌రినీ హెచ్చరించారు. అయినప్పటికీ ఆమె ఆ యువకుడితో సంబంధాన్ని కొనసాగిస్తూ వస్తున్న‌ది. అదీగాక అత‌నిని పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ది. ఇదే విషయాన్ని స‌ద‌రు మహిళ తన అన్నదమ్ములకు చెప్పగా వారు రెచ్చిపోయారు. ఆవేశంతో ఆమెపై దాడికి తెగ‌బ‌డ్డారు. గొంతు నులిమి చంపేశారు. ఆ విషయం బయటకు పొక్కకుండా గుట్టుగా అంత్యక్రియలు నిర్వహించారు. ప్రియురాలు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన ఆ యువ‌కుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు మ‌హిళ సోద‌రుల‌ను అదుపులోకి తీసుకుని విచారించ‌గా అస‌లు నిజాలు వెలుగు చూశారు. అనంత‌రం వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

అక్ర‌మ సంబంధం పెట్టుకున్న చెల్లెలు.. ప్రాణం తీసిన సోద‌రులు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts