కరోనా వైర‌స్‌తో స్పెయిన్ ప్రిన్సెస్ మృతి..!!

March 29, 2020 at 1:54 pm

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను అత‌లాకుత‌లం చేస్తోంది. ఎక్క‌డో చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచమంతా విస్తరిస్తూ ప్రాణాలను బలి తీసుకుంటోంది. రోజురోజుకి ఈ వైరస్ బారిన పడి మృత్యుఒడికి చేరుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ మహమ్మారి దెబ్బకు ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ సహా పలు ఐరోపా దేశాల్లో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఇక తాజాగా స్పెయిన్ ప్రిన్సెస్ మరియా థెరిసా కరోనా వైరస్ సంక్రమణతో కన్నుమూశారు. ఆమె వయస్సు 86 సంవత్సరాలు.

మారియా థెరిసా పారిస్‌లోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతిచెందినట్టు ఆమె సోదరుడు సిక్టో హెన్రిక్ డీ బార్బన్ ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు. యువరాణికి కరోనా వైరస్ సోకినట్లు గుర్తించిన తరువాత చికిత్స తీసుకోవడం ప్రారంభించారు. ప్రపంచంలోని ఒక రాజ కుటుంబం నుండి నమోదైన తొలి కరోనా మృతి కేసు ఇది. స్పెయిన్ రాజ కుటుంబానికి చెందిన క్యాడెట్ విభాగం హౌస్ ఆఫ్ బార్బన్ పర్మాలో మారియా థెరిసా సభ్యురాలు.

ఇక శుక్రవారం మాడ్రిడ్‌లో స్పెయిన్ యువరాణి మరియా థెరిసాకు అంత్యక్రియలు జరిగాయి. కాగా, స్పెయిన్ లో ఇప్పటికే కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. అక్కడ ఇప్పటివరకు 73,235 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అందులో 5,982 మంది చనిపోయారు.

కరోనా వైర‌స్‌తో స్పెయిన్ ప్రిన్సెస్ మృతి..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts