కరోనా విపత్తు నిధికి బన్నీ మరొక రూ.20 లక్షల విరాళం…..!!

March 30, 2020 at 3:43 pm

ఇప్పటికే ప్రపంచంలో ఉన్న దేశాలు అన్నీ కూడా కరోనా మహమ్మారి దెబ్బకు చాలావరకు లాకౌట్ లు ప్రకటించక తప్పని పరిస్థితి నెలకొంది. సామజిక దూరం పాటించడం, ఇళ్ల నుండి ఎవరూ కూడా బయటకు రాకుండా ఉండడంతో పాటు ప్రతి ఒక్కరు ఎప్పటికప్పుడు చేతులను 20 సెకండ్ల పాటు శుభ్రం చేసుకోవటం వంటి నియమాలు తప్పనిసరిగా పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరడం జరిగింది. అయితే కరోనా అడ్డుకట్టకు మన దేశాన్ని మూడు వారాల పాటు లాకౌట్ చేయడంతో చాలవరకు దిగువ వర్గాల వారిపై ఆ ప్రభావం పడింది.

 

 

ముఖ్యంగా రోజువారీ పనులు చేసుకునేవారు బయటకు వచ్చే వీలు లేక, మరికొందరికి అయితే కనీసం రోజువారీ తిండి కూడా దొరకని క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి. అయితే అందుకుగాను ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఆదుకోవడానికి ఫ్రీ రేషన్ తో పాటు కొంత మొత్తాన్ని వారి వారి ఖాతాల్లో వేయడం జరుగుతుందని ప్రకటించాయి. ఇక మరోవైపు ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా తమవంతుగా ఎప్పుడూ ముందుండే మన టాలీవుడ్ సినిమా పరిశ్రమ వారు, ఈసారి కూడా కరోనా నిరోధానికి భారీ స్థాయిలో విరాళాలు అందించడం జరిగింది.

 

 

మన టాలీవుడ్ నటుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తన వంతుగా ఇప్పటికే రూ.1.25 కోట్ల రూపాయలు కరోనా బాధితులకు ప్రకటించగా, నేడు కరోనా విపత్తు నిధికి మరొక రూ. 20 లక్షలు ఇస్తున్నట్లు కాసేపటి క్రితం ప్రకటించారు. ఇటువంటి విపత్కర సమయంలో ప్రజలను ఆదుకోవడం మన వీధి అని, ప్రజల వల్లనే మేము ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నాం అని పలువురు సినిమా ప్రముఖులు చెప్పడం విశేషం. కాగా దీనితో మొత్తం బన్నీ రూ. 1.45 కోట్లు కరోనా బాధితులకు విరాళం ఇవ్వడం జరిగింది….!!

కరోనా విపత్తు నిధికి బన్నీ మరొక రూ.20 లక్షల విరాళం…..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts