పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్‌కు స్పందించిన తమిళనాడు సీఎం..!!

March 30, 2020 at 3:19 pm

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల‌ను క‌మ్మేస్తోంది. దీన్ని అరిక‌ట్టేందుకు కేంద్రం 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న తరుణంలో ఏపీకి చెందిన మత్స్యకారులు చేపల వేట కోసం తమిళనాడుకు వెళ్లి చిక్కుకుపోయారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఆయన‌ ట్వీట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం సీహెచ్ చొలగండి గ్రామం నుంచి చేపల వేట కోసం 30 మంది మత్స్యకారులు తమిళనాడు తీర ప్రాంతానికి వెళ్లారని తెలిపారు.

లాక్ డౌన్ వల్ల వారంతా చెన్నై హార్బర్ దగ్గర చిక్కుకుపోయార‌ని తెలుపారు. అలాగే ఆ మత్స్యకారులకు అక్కడ వసతి, భోజనం లేక ఇబ్బందులు పడుతుండటంతో వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయని తెలిపారు. జనసేన నాయకుల ద్వారా తనకు ఈ సమాచారం తెలిసిందన్నారు. కాబ‌ట్టి వాళ్ల‌కు ఆదుకోవాల‌ని పవన్ కళ్యాణ్ తమిళనాడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

అయితే పవన్ విజ్ఞప్తికి తమిళనాడు సీఎం పళనిస్వామి సానుకూలంగా స్పందించారు. సంబంధిత శాఖకు దీనిపై ఆదేశాలు జారీ చేస్తామని.. వారిని జాగ్రత్తగా చూసుకుంటామని ట్విట్టర్ వేదికగా హామీ ఇచ్చారు. తమ దృష్టికి తీసుకొచ్చినందుకు పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప‌వ‌న్ క‌ళ్యాణ్ పళనిస్వామికి తమిళంలో ప్రత్యేకంగా మరో ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన పళని.. వారి బాగోగులు చూసుకుంటామని ట్విట్టర్ ద్వారా తెలిపారు.

పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్‌కు స్పందించిన తమిళనాడు సీఎం..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts