బిగ్‌బాస్‌పై మ‌ళ్లీ చ‌ర్చ‌లు ప్రారంభం.. ఇక రచ్చ ర‌చ్చే..!!

March 13, 2020 at 5:21 pm

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. తెలుగు స‌క్సెస్ సాధించిన రియాల్టీ షోల్లో ఇది కూడా ఒక‌టి అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. అక్క‌డెక్క‌డో నెంద‌ర్లాండ్స్‌లో బిగ్ బ్ర‌ద‌ర్‌గా ప్రారంభ‌మై.. హిందీ బిగ్‌బాస్‌గా మారింది. ఈ షో కోసం ముంబయిలోని ఖరీదైన లోనావాలా ప్రదేశంలో ఓ భారీ విల్లాను నిర్మించారు.అదే పేరుతో తెలుగులోనూ స్టాట్ అయింది. ఇప్ప‌టికే తెలుగు మూడు సీజ‌న్స్ కంప్లీట్ చేసుకున్న బిగ్‌బాస్ ఇప్పుడు నాలుగో సీజ‌న్ ప్రారంభించ‌డానికి స‌న్నాహాలు చేస్తోంది.

ఇక మొదటి సీజన్‌కు ఎన్టీఆర్, రెండో సీజన్‌కు నాని, మూడో సీజన్‌కు నాగార్జున హోస్ట్‌లుగా వ్యవహరించారు. అయితే ఎన్టీఆర్‌ హోస్టింగ్ చేసిన సీజ‌న్ 1 స్థాయిలో మళ్లీ ఎవరు కూడా షో కు స్టార్‌డంను తీసుకు రాలేక పోతున్నారు. ఇక ఎప్పటిలాగే ఈసారి కూడా హోస్ట్‌ విషయంలో చర్చ జరుగుతోంది. మూడవ సీజన్‌కు నాగార్జున బాగానే హోస్ట్‌గా చేశాడు. కాని ఆయన స్థానంలో మరో హీరో అయితే బాగుంటుందనే అభిప్రాయం కూడా కొందరు అంటున్నారు. దీంతో బిగ్‌బాస్‌ 4 కు కొత్త హోస్ట్‌ను వెదికే పనిలో నిర్వాహకులు ఉన్నట్లుగా తెలుస్తోంది.

కొత్త వారు ఎవరు సెట్‌ అవ్వకుంటే నాగార్జునతో కంటిన్యూ చేసే అవకాశాలు క‌నిపిస్తున్నాయి. బిగ్‌బాస్ 4 ప్రారంభం కావ‌డానికి మరో మూడు నెలలే టైమ్ ఉండ‌డంతో.. పార్టిసిపెంట్స్‌కు సంబంధించిన ఎంపిక పక్రియ మొదలైంది. సెలబ్రెటీలను విభిన్న రంగాలకు చెందిన వారిని తీసుకోవాలని భావిస్తున్నారు. మ‌రి ఆ సారి బిగ్‌బాస్ ఎంత ర‌చ్చ ర‌చ్చ అవుతుందో చూడాలి.

బిగ్‌బాస్‌పై మ‌ళ్లీ చ‌ర్చ‌లు ప్రారంభం.. ఇక రచ్చ ర‌చ్చే..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts