17ఏళ్ల త‌రువాత ఆయ‌న‌తో బాలకృష్ణ‌..!

March 8, 2020 at 3:04 pm

నంద‌మూరి బాల‌కృష్ణ కెరీర్‌లో అతిపెద్ద విజ‌యాన్ని అందించ‌డ‌మేగాక‌, ఆయ‌న‌కు ప్ర‌త్యేక ఇమేజ్‌ను తీసుకొచ్చిన సినిమాలు ఏమైనా ఉన్నాయంటే అందులో స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహ‌నాయుడు చిత్రాలు. ఇప్ప‌టికే ఆ సినిమాల్లో ఆయ‌న చెప్పిన ప‌లు సంభాష‌ణ‌లు అక్క‌డ‌క్క‌డ వినిపిస్తుంటాయి. అంత‌టి పేరును సంపాదించి పెట్టాయి మ‌రి ఆ చిత్రాలు. వాటిని తెర‌కెక్కించింది బీ గోపాల్. ఆ రెండు సినిమాలే కాదు బాల‌య్య‌తో అంతకు ముందు కూడా లారీ డ్రైవ‌ర్‌, రౌడి ఇన్‌స్పెక్ట‌ర్ సినిమాల‌ను కూడా అందించాడు. చివ‌ర‌గా ప‌ల్నాటి బ్ర‌హ్మ‌నాయుడు సినిమాను తీశారు. అది బాక్సాఫీసు వ‌ద్ద భారీ డిజాస్ట‌ర్గా మిగిలిపోయింది. దీంతో అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు వారిద్ద‌రి కాంబినేష‌న్ మ‌రో సినిమా రాలేదు.

తాజాగా టాలివుడ్ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం 17 ఏళ్ల అనంత‌రం వారిద్ద‌రి కాంబినేష‌న్‌లో మ‌రోసారి సినిమా రానున్న‌ట్లు తెలుస్తున్న‌ది. మధ్యలో హరహర మహదేవ సినిమాను మొదలు పెట్టినా కూడా అది ముందుకు సాగలేదు. ఆదిలోనే ఆగిపోయింది. అయితే ఇప్పుడు మాత్రం బాలయ్య, బి గోపాల్ కాంబినేషన్‌లో చిన్ని కృష్ణ రాసిన కథతో సినిమా రాబోతుందని జోరుగా ప్రచారం సాగుతున్న‌ది. మే నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంద‌ని తెలుస్తున్న‌ది. అదీగాక నరసింహనాయుడు సినిమాకు క‌థ‌,ను అందించిన చిన్నికృష్ణనే ఈ సినిమాకు కథను అందిస్తుండ‌డం మ‌రోవిశేషం. మే నుంచి మొదలుపెట్టి డిసెంబర్‌లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక బాల‌య్య ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా మొదలుపెట్టాడు ఈయన. ఆ సినిమా తర్వాత ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు బాలయ్య. ఇక గోపాల్ విష‌యానికి వ‌స్తే రామ్ హీరోగా వచ్చిన మస్కా తర్వాత గోపాల్ మరో సినిమా చేయలేదు. మధ్యలో గోపీచంద్‌తో తెరకెక్కించిన ఆరడుగుల బుల్లెట్ సినిమా విడుదల కాలేదు. ఇప్పుడు సుదీర్ఘ విరామం త‌రువాత బాలయ్యతో గోపాల్ సినిమా చేయ‌బోతుండ‌డంతో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొన్న‌ది.

17ఏళ్ల త‌రువాత ఆయ‌న‌తో బాలకృష్ణ‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts