కరోనా వచ్చిన హీరో సేఫ్.. ఎవరో తెలుసా?

March 17, 2020 at 5:27 pm

ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ బారి నుండి అందరూ తగు జాగ్రత్తలు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలంటూ పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదిక పలు ప్రకటనలు చేస్తున్నారు. అయితే వీరిలో సినిమా ఇండస్ట్రీ వాళ్లు చెప్పే సందేశాలు కూడా ఉండగా, ప్రజలు వాటిని ఎక్కువగా చూస్తున్నారు.

అయితే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే హీరో, హీరోయిన్లు ఇలాంటి వైరస్ బారిన పడతారా? అని చాలా మందికి సందేహం ఉంటుంది. కానీ ఈ కరోనా వైరస్ ఎవ్వరినీ వదలడం లేదు. తాజాగా హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్‌కు కరోనా వైరస్ ఉన్నట్లు పాజిటివ్‌ రిపోర్ట్ వచ్చింది. దీంతో ఆయన తన భార్యతో కలిసి ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. వారు ఇటీవల ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లినప్పుడు అక్కడ ఈ వైరస్ సోకినట్లు తెలుస్తోంది.

కాగా తాజాగా వారు ఈ వైరస్ నుండి పూర్తిగా కోలుకున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇక టామ్ హాంక్స్ హాలీవుడ్‌లో ప్రముఖ నటుడుగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన సినిమాల్లో ఫారెస్ట్ గంప్ అనే సినిమా సూపర్ సక్సెస్ కాగా, ఈ సినిమాను ప్రస్తుతం బాలీవుడ్‌లో అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ అనే టైటిల్‌తో రీమేక్ చేస్తున్నాడు.

కరోనా వచ్చిన హీరో సేఫ్.. ఎవరో తెలుసా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts