ట్రంప్ భార్య‌కు కరోనా పరీక్షలు.. చివ‌ర‌కు ఏం తేలిందంటే..?

March 24, 2020 at 6:05 pm

చైనాలో పుట్టుకొచ్చిన క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కరోనా వైరస్ భయంతో ప్రపంచంలోని అనేక దేశాలలోని ప్రజలు ఇంటిపట్టునే ఉండిపోవడంతో నగరాలు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మనుషుల శరీరంలోకి కరోనా వైరస్ చేరగానే.. తన ఉనికిని కాపాడుకునేందుకు అది మనుషుల్లో కణాలను ఆక్రమిస్తోంది. అక్కడ గూడులా మారి కోట్ల వైరస్‌లను సృష్టిస్తోంది. ఫలితంగా వైరస్‌ను అడ్డుకోవడం, ఆపడం కష్టమైపోతోంది. దీంతో ప్ర‌పంచ‌దేశాలు దాన్ని హ‌త‌మార్చ‌డానికి అనేక ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

అయిన‌ప్ప‌టికీ ఫలితం లేకుండా పోతుంది. మ‌రియు రోజురోజుకీ ఇది వేగంగా విస్తరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియాకు కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే ఆమెకు వైరస్ సోకలేదని తేలడంతో వైట్ హౌస్ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.

ఈ నెల 13న డొనాల్డ్ ట్రంప్, మెలానియాలకు కరోనా పరీక్షలు నిర్వహించగా, ట్రంప్ కు నెగెటివ్ వచ్చిన విషయాన్ని అప్పుడే వెల్లడించారు. మెలానియా ఫలితాన్ని ఇవాళ తెలిపారు. మెలానియా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. కాగా, కరోనా వైరస్ అమెరికాను కూడా అతలాకుతలం చేస్తోంది. ఇప్పటివరకు అక్కడ 400కి పైగా మరణాలు సంభవించాయి. బాధితుల సంఖ్య 33 వేలు దాట్టిన‌ట్టు తెలుస్తోంది. దీంతో ట్రంప్ అక్కడ క‌ఠ‌న చ‌ర్య‌లు చేప‌ట్టారు.

ట్రంప్ భార్య‌కు కరోనా పరీక్షలు.. చివ‌ర‌కు ఏం తేలిందంటే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts