వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ‘వ‌కీల్‌సాబ్‌’..!!

March 29, 2020 at 12:24 pm

ప‌వ‌ర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ రీఎంట్రీ చిత్రం ‘వకీల్‌సాబ్‌’పై అభిమానులు భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. బాలీవుడ్‌ హిట్‌ చిత్రం ‘పింక్‌’కు రీమేక్‌గా ఇది తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మాస్ ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని కథలో భారీగానే మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్టు ఇటీవ‌ల విడుద‌లైన‌ పవన్ లుక్ కూడా ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. ఇక వేణు శ్రీరామ్‌ దర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు.

అలాగే ఈ చిత్రంలో నివేదా థామస్, ప్రకాష్‌రాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇప్పటికే నిర్మాతలు మే 15న సినిమా విడుదల చేస్తామని తెలిపారు. అయితే కొన్ని రోజులు నెలకొన్న పరిస్థితులతో సినిమా విడుదలపై పడే అవకాశాలు కన్పిస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. కానీ, ఈ సినిమా 80 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుంది. మిగ‌తా షూటింగ్ పూర్తి చేసే లోపు క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో సినిమా ఆగింది. అయితే క‌రోనా వైర‌స్ వ‌ల్ల వ‌చ్చిన ఈ గ్యాప్‌ను ‘వ‌కీల్‌సాబ్’ టీమ్ ఉప‌యోగించుకుంటుందట‌.

ముఖ్యంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇప్ప‌టి వ‌ర‌కు పూర్త‌యిన సినిమా ఎడిటింగ్ చూసి డ‌బ్బింగ్ చెబుతున్నార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో స‌మాచారం. ఇలా చేస్తేనే లాక్ డౌన్ ఎత్తివేయ‌గానే మిగిలిన పార్ట్‌ను త్వ‌ర త్వ‌ర‌గా పూర్తి చేసి అనుకున్న టైమ్‌లో విడుద‌ల చేసే అవ‌కాశం ఉంటుంద‌ని చిత్ర‌యూనిట్ భావిస్తోంది. కాగా, ప్రస్తుతం పవన్‌ ఈ సినిమాతో పాటు క్రిష్‌ దర్శకత్వంలో ఓ భారీ పాన్‌ ఇండియా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.

వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ‘వ‌కీల్‌సాబ్‌’..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts