ర‌వితేజ `క్రాక్` నుంచి వరలక్ష్మీ శరత్ కుమార్ ఫస్టులుక్ అదిరింది..!

March 5, 2020 at 1:07 pm

మాస్ మహారాజా రవితేజ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మూడోసారి వస్తోన్న సినిమా ‘క్రాక్‌`. ఇప్పటికే వీరిద్ద‌రి కాంభినేషన్‌లో వచ్చిన డాన్‌శీను, బలుపు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. దీంతో తాజా చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రంలో శృతి హాసన్‌ కథానాయిక నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వరస ఫ్లాపులతో ఉన్న రవితేజ కెరీర్‌కు ఈ చిత్రం డూ ఆర్ డై గా మారిపోయింది.

అప్పట్లో వరస డిజాస్టర్స్‌తో పూర్తిగా ఇమేజ్ పడిపోతున్న సమయంలో రవితేజతో బలుపు సినిమా చేసి హిట్ ఇచ్చాడు గోపీచంద్ మలినేని. మరోసారి ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు రవితేజ. దాంతో ఇప్పుడు కూడా ఇదే చేస్తాడని నమ్ముతున్నారు రవితేజ అభిమానులు. ఇక ఈ సినిమాలో కీలకమైన పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించనుంది. అయితే ఈ రోజున వరలక్ష్మీ శరత్ కుమార్ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ‘క్రాక్’ సినిమాలో ‘జయమ్మ’గా వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్రను పరిచయం చేస్తూ ఆమె ఫస్టులుక్ ను విడుద‌ల చేశారు.

వరలక్ష్మీ శరత్ కుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వదిలిన ఈ పోస్టర్లో, ఆమె లుక్ బాగా ఆక‌ట్టుకుంటోంది. ఆమె లుక్ చూస్తుంటే, గ్రామీణ నేపథ్యంలో నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రనే పోషిస్తున్నట్టుగా అనిపిస్తోంది. నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలకి వరలక్ష్మీ శరత్ కుమార్ కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది. అందువలన ఈ సినిమాలోను ఆమె అదే తరహా పాత్రను చేస్తోందని అనుకోవచ్చు. కాగా, ఈ సినిమాలో మరోసారి పోలీస్ గెటప్ లో కనిపించనున్నాడు మాస్ రాజా.

ర‌వితేజ `క్రాక్` నుంచి వరలక్ష్మీ శరత్ కుమార్ ఫస్టులుక్ అదిరింది..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts