ఆ సినిమాకు 10 కోట్ల రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేస్తున్న వెంక‌టేష్‌..!!

March 24, 2020 at 2:45 pm

వైవిధ్యభరిత పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన విక్టరీ వెంకటేష్.. ప్ర‌స్తుతం నారప్ప సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ ఫిలిం ‘అసురన్’కు ఇది రీమేక్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను నిర్మాతలు. ఎఫ్ 2, వెంకీమామ వరుస హిట్లతో మంచి జోరు మీద ఉన్న విక్టరీ వెంకటేష్. ముఖ్యంగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఎఫ్ 2 చిత్రంలో వరుణ్ తేజ్ తో కలిసి వెంకటేష్ నటించిన విషయం తెల్సిందే.

ఒక చిన్న చిత్రంగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా దాదాపుగా వంద కోట్ల వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్-3 రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవల‌ స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంతో మంచి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్న అనీల్ రావిపూడి ప్ర‌స్తుతం ఎఫ్ 3 స్క్రిప్ట్ రూపొందించే ప‌నిలో ఉన్నాడు.

అయితే ఈ సినిమ‌కు వెంక‌టేష్ భారీగా రెమ్యున‌రేష‌న్ పెంచేసిన‌ట్టు తెలుస్తోంది. ఏకంగా ఎఫ్-3 సినిమాకి వెంక‌టేష్‌ 10 కోట్లను డిమాండ్ చేశారని తెలుస్తోంది. అయితే దిల్ రాజుతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా, ఆల్రెడీ ‘ఎఫ్ 2’ సక్సెస్ ఇచ్చినందువలన కొంత తగ్గినట్టు చెబుతున్నారు. ఆ తరువాత సినిమా నుంచి మాత్రం ఆయన 10 కోట్లకి తగ్గకూడదనే ఉద్దేశంతో వున్నారని అంటున్నారు.

ఆ సినిమాకు 10 కోట్ల రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేస్తున్న వెంక‌టేష్‌..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts