నారప్ప కోసం వెంకీ ఏం చేస్తున్నాడంటే?

March 16, 2020 at 11:33 pm

తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ చిత్రాన్ని తెలుగులో విక్టరీ వెంకటేష్ రీమేక్ చేస్తు్న్నాడనే వార్త వచ్చినప్పటి నుండి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్నాడనగానే అందరి ఫ్యూజులు ఔట్ అయ్యాయి. బ్రహ్మోత్సవం లాంటి డిజాస్టర్ అందించిన ఈ డైరెక్టర్‌తో వెంకీ సినిమా ఎందుకు చేస్తు్న్నాడనే సందేహం చాలా మందిలో మెదిలింది.

అయితే నారప్ప సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ చూశాక వారి సందేహానికి జవాబు దొరికింది. శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాను ఎంత ప్రెస్టీజియస్‌గా తీసుకున్నాడో ఆ ఫస్ట్ లుక్‌ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. అయితే కేవలం దర్శకుడు మాత్రమే కాకుండా నారప్ప కోసం వెంకటేష్ కూడా చాలా మార్పులు చేస్తున్నాడట. ఈ సినిమాలో రియలిస్టిక్‌గా కనిపించేందుకు ఆయన తన ఆహార అలవాట్లను కూడా మార్చుకున్నారట. గతంలో వెంకటేష్ ఇలాంటి మార్పులు ఎప్పుడు చేయలేదని చిత్ర యూనిట్ అంటోంది.

మొత్తానికి నారప్ప కోసం అటు డైరెక్టర్, ఇటు వెంకటేష్ ఎలాంటి కష్టానికైనా రెడీ అంటున్నారు. ఇటీవల అనంతపురంలో భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న నారప్ప, ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ కారణంగా బ్రేక్ తీసుకున్నాడు. ఇక ఈ బ్రేక్ తరువాత మళ్లీ చిత్ర షూటింగ్‌ను ప్రారంభించేందుకు వెంకీ అండ్ టీమ్ రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

నారప్ప కోసం వెంకీ ఏం చేస్తున్నాడంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts