స్పోర్ట్స్ డ్రామాలో వెంకీనా…ఏ పాత్ర‌లోనో తెలిస్తే షాకే?

March 30, 2020 at 9:08 am

తరుణ్ భాస్కర్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ కొంత‌ కాలంగా వెంకటేష్ తో మూవీ చేయనున్నాడని కొద్దికాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వెంకటేష్ కూడా తరుణ్ తో మూవీ ఉంటుందని ఒక‌సారి చెప్పడం జరిగింది. ఐతే తరుణ్ తీసుకెళ్ళిన స్క్రిప్ట్ వెంక‌టేష్‌కి ఎందుకో పూర్తిగా నచ్చలేద‌ట‌. దీంతో ఆయ‌న కొన్ని మార్పులు చేర్పులు చెప్పార‌ట‌. కాగా దీని పై డైరెక్టర్ తరుణ్ స్పష్టత ఇచ్చారు. వెంకటేష్ కొరకు పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేశాను అని చెప్పిన ఆయన ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా అని చెప్పడం విశేషంగా మారింది.

వెంకటేష్ త‌ర్వాత చిత్రం తరుణ్ తో ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఆయన‌ తమిళ చిత్రం అసురన్ తెలుగు రీమేక్నాలో న‌టిస్తున్నారు. దాని టైటిల్ నారప్పగా రివీల్ చేయ‌డం తెలిసిన విష‌య‌మే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుండగా షూటింగ్ చాలా వరకు పూర్తైయింది. ఇప్ప‌టికే ఈ చిత్రం పోస్ట‌ర్ విడుద‌లైంది. మ‌రి క‌రోనా మ‌హ‌మ్మారి రావ‌డంతో మ‌ధ్య‌లో కాస్త బ్రేక్ ఇవ్వ‌వ‌ల‌సి వ‌చ్చింది. ఇదిలా ఉంటే… త‌రుణ్ వెంకీకి స్పోర్ట్స్ డ్రామా క‌థని చెప్ప‌డం అనేది ఆశ‌క్తిక‌రంగా మారింది. గ‌తంలో వెంకీ చేసిన గురు చిత్రంలో ఆయ‌న కోచ్‌గా చేశారు. మ‌రి ఈ చిత్రంలో త‌రుణ్ వెంకీని ఏ విధంగా చూపించ‌బోతున్నాడు. అన్న‌ది అంతా ఆశ‌క్తి క‌రంగా మారింది. ఈ వ‌య‌సులో ఆయ‌న్ని ప్లేయ‌ర్‌గా అయితే చూపించ‌లేరు. మ‌రి త‌రుణ్ ఐడియా ఏంటో వెంకీని ఏ విధంగా చూపించ‌బోతున్నారో వేచి చూడాలి.

స్పోర్ట్స్ డ్రామాలో వెంకీనా…ఏ పాత్ర‌లోనో తెలిస్తే షాకే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts