సుకుమార్ సినిమాలో ఆ పాత్ర కాదంటున్న విలన్

March 16, 2020 at 11:53 am

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషనల్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు బన్నీ రెడీ అయ్యాడు. ఇప్పటికే తొలి షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకున్నాడు బన్నీ. ఇక ఈ సినిమాలో తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నాడనే విషయం తెలిసిందే.

అయితే అతడి పాత్ర విషయంలో పలు వార్తలు సోషల్ మీడియాలో వినిపించాయి. ఈ సినిమాలో బన్నీ ఓ లారీ డ్రైవర్‌గా నటిస్తుండగా, ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు వార్తలు వినిపించాయి. కాగా ఈ సినిమాలో విజయ్ సేతుపతి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తాడని వార్తలు వచ్చాయి. వాటిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి నటించేది పోలీస్ పాత్రలో కాదని తేల్చేసింది.

దీంతో ఆయన నటించే పాత్రపై వస్తున్న వార్తలన్నీ గాలివార్తలే అని తేలిపోయింది. ఇక ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. మొత్తానికి బన్నీ సినిమాపై ఇప్పటికే పలు పుకార్లు వస్తుండటంతో ఆ సినిమాపై మరింత అంచనాలు క్రియట్ అవుతాయని చిత్ర వర్గాలు అంటున్నాయి.

సుకుమార్ సినిమాలో ఆ పాత్ర కాదంటున్న విలన్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts