అబ్బాయి ఫొటోలు మార్ఫింగ్ చేసి.. బ్లాక్ మెయిల్‌కు దిగిన అమ్మాయి..!

March 4, 2020 at 2:20 am

సాధార‌ణంగా అమ్మాయిల ఫొటోల‌ను తీసి.. మార్పింగ్ చేసి అబ్బాయిలు బ్లాక్ మెయిల్‌కు పాల్ప‌డుతుంటారు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు నిత్యం ఎక్క‌డో ఒక చోట చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్క‌డ అది రివ‌ర్స్‌గా జ‌రిగింది. అమాయ‌కుడైన ఓ యువ‌కుడి ఫొటోల‌ను తీసి.. వాటిని మార్ఫింగ్ చేసి, అనంత‌రం బ్లాక్ మెయిల్‌కి తెగ‌బ‌డింది ఓ చిన్న‌ది. డ‌బ్బులు గుంజ‌డ‌మేగాక‌, తాను చెప్పిన‌ట్లు ప‌డిఉండాలంటూ ఆంక్ష‌లు విధించింది. ఇక ఆ వేధింపులు భ‌రించ‌లేక, పోతే ప‌రువుని పోనీ అనుకుని ఆ యువ‌కుడు పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో ఈ విష‌య‌లు వెలుగులోకి వ‌చ్చింది. ఈ సంఘ‌ట‌న హైద‌రాబాద్ వ‌న‌స్థ‌లిపురంలో జ‌రిగింది. పోలీసులు, బాధితుడు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం..

హైదరాబాద్ న‌గ‌రం వనస్థలిపురం SF కాలనీకి చెందిన ఓ యువ‌కుడికి కొద్ది కాలం క్రితం ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఫొటోలు వ‌చ్చాయి. అవి అత‌నివే. కాక‌పోతే అశ్లీలంగా ఉన్న‌వి. దీంతో వాటిని చూడ‌గానే స‌ద‌రు యువ‌కుడు కంగుతిన్నాడు. ఇంట్లో తెలిస్తే భార్య ముందు, కుటుంబ స‌భ్యుల ముందు ప‌రువు పోతుందని ఆందోళ‌న‌కు గుర‌య్యాడు.  అంత‌లోనే ఆ యువ‌కుడికి కాల్ వ‌చ్చింది. లిఫ్ట్ చేయ‌గా అవ‌త‌లి నుంచి మాట్లాడింది యువ‌తి. ఎవ‌రో అనుకున్నాడు. కానీ ఆమె చెప్పిన మాట‌లు విని మ‌రింత కంగుతిన్నాడు. తాను ఓ హ్యాకర్న‌ని, అశ్లీల‌ ఫొటోలు ఇంకా చాలానే త‌న వ‌ద్ద ఉన్నాయ‌ని, ఇన్‌స్టాగ్రాం అకౌంట్ నుంచీ వాటిని తొలగించాలంటే… 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయ‌డంతో పాటు, డ‌బ్బులు ఇవ్వ‌కుంటే వాటిని నీ భార్య‌కు, స్నేహితుల‌కు పంపిస్తాన‌ని చెప్ప‌డంతో బిత్త‌పోయాడు యువ‌కుడు. ప‌రువు పోతుంది భావించి ఆ యువ‌తి అడిగిన మొత్తాన్ని ఆమె సూచించిన అకౌంట్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేశాడు.

అయిన‌ప్ప‌టికీ స‌ద‌రు కిలేడి త‌న బుద్ధి మార్చుకోలేదు. మళ్లీ మళ్లీ అవే బెదిరింపుల‌కు దిగ‌డం మొద‌లు పెట్టింది. అదీగాక తను చెప్పినట్లు వినాలనీ, తన కింద పడి ఉండాలని హుకుం జారీ చేయ‌సాగింది. బూతు మెసేజ్‌లు పంపడం మొదలుపెట్టింది. ఇక ఆమె భరించలేకపోయిన యువ‌కుడు ఇలాగే ఊరుకుంటే తన జీవితం నాశనమవుతుందని భావించాడు. నేరుగా వనస్థలిపురం పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. అంతా విన్న పోలీసులు కూడా మొదట నోరెళ్ల‌బెట్టారు. త‌రువాత కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. స‌ద‌రు యువ‌కుడు డ‌బ్బు పంపిన‌ అకౌంట్ వివ‌రాల‌ను ప‌రిశీలించ‌గా అవి డూప్లికేట్ అని తెలిశాయి. కానీ ఫోన్ నంబర్ మాత్రం ఒరిజినల్‌దే ఉంది. దాని ఆధారంగా కూపీ లాగి ఆ యువతిని గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. తీరా త‌న‌ను బెదిరించిన ఆ యువ‌తిని చూసి మ‌రింత షాక్‌కు గుర‌య్యాడు ఆ యువ‌కుడు. ఎందుకంటే ఆమె ఎవ‌రో కాదు. అత‌ని తన పాత స్నేహితురాలు కావ‌డం కొస‌మెరుపు. 27 ఏళ్ల ఆ నిందితురాలు అమాయకుడైన యువ‌కుడికి తెలియకుండా చాలాసార్లు అత‌న‌ని ఫొటోలు తీసింది. వాటినే మార్ఫింగే చేసి, బ్లాక్ మెయిల్కు దిగ‌డ‌డం గ‌మ‌నార్హం. అయితే అధికారులు ఇంకా ఆమె ఎంత మంది అబ్బాయిలను ఇలా ఫొటోలు తీసిందో అన్న కోణంలోనూ ద‌ర్యాప్తును కొన‌సాగిస్తున్నారు. నిందితురాలిని రిమాండ్ కు త‌ర‌లించారు.

అబ్బాయి ఫొటోలు మార్ఫింగ్ చేసి.. బ్లాక్ మెయిల్‌కు దిగిన అమ్మాయి..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts