క‌రోనాపై వైఎస్ జగన్ కీలక నిర్ణ‌యం?

March 26, 2020 at 1:19 pm

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనాతో దేశ‌ ప్ర‌జ‌లంతా ఇబ్బంది ప‌డుతున్న విష‌యం తెలిసిందే. దీని పై రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఈ విష‌యం పై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాయంత్రం 5గంటలకు ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకోబుతున్నారు. దీనికి సంబంధించి ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… కరోనా నేపథ్యంలో ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. అయితే ఇప్పటికే దేశం మొత్తం లాక్‌డౌన్లో ఉన్న విష‌యం తెలిసిందే. ఏపీలో కూడా అన్నీ బంద్ అయ్యాయి. బ‌య‌ట‌కు రావ‌డానికి లేని ప‌క్షంలో… నిత్యావసర సరకుల రేటులు ధరలను వ్యాపారులు భారీగా పెంచేశారు. దీంతో ప్ర‌జ‌లు తీవ్ర న‌ష్టాల్లో ప‌డి ఇబ్బందులు ప‌డుతున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే జనాలు, విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ప‌డుతున్నారు. రాష్ట్ర సరిహద్దుల దగ్గరే ఆగిపోయి.. నానా ఇబ్బందులు పడుతున్నారు. క‌నీసం వారికి తాగ‌డానికి మంచి నీరు కూడా లేనంత‌లా తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. సాయంత్రం మీడియా మీట్‌లో వీరిని ఉద్దేశించి కూడా జగన్ ప్రసంగిస్తారని స‌మాచారం.

ఇక ఆయ‌న ఈ విష‌యాల‌తో పాట ఒక కీల‌క న‌ర్ణ‌యాన్ని కూడా తీసుకోబోతున్నార‌ని తెలుస్తోంది. ఆ ప్రకటన ఏమై ఉంటుందా అని ఆయ‌న ఏం ప్రకటించబోతున్నారు..? అనేదానిపై ఏపీ ప్రజలు సర్వత్రా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిత్యావసర సరకుల పంపిణీ, నగదు పంపిణీ, వాలంటీర్ వ్యవస్థ పనితీరు పై కూడా జగన్ మాట్లాడబోతున్నారని తెలుస్తోంది. మ‌రి ఈ క‌రోనా పై మరోవైపు.. ఇప్పటికే పలువురు ప్రముఖులు, సినీ నటులు విరాళాలు ప్ర‌క‌టిస్తూ వారి వారి స‌హాయ‌స‌హ‌కారాల‌ను ఎంతో బాధ్య‌త‌తో పూర్తి చేస్తున్నారు. ఈ విషయంపై కూడా జగన్ మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ అయితే ప్ర‌జ‌లు చెప్పిన మాట విన‌క‌పోతే త‌ప్ప‌టి చ‌ర్య‌లు తీసుకోవ‌ల‌సి వ‌స్తుంద‌ని ఇప్పటికే.. షూట్ ఎట్ సైట్ పరిస్థితులు తెచ్చుకోవద్దని రాష్ట్ర ప్రజలకు ఒకింత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన విషయం కూడా తెలిసిందే.

క‌రోనాపై వైఎస్ జగన్ కీలక నిర్ణ‌యం?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts