అన్ని లోతులు.. గోతులు.. ఇప్పుడు న‌డ‌క ఎలా?

March 25, 2020 at 5:52 pm

అనుకున్న‌ది సాధించ‌డం అనేది పెద్ద ఊపును ఇచ్చే విష‌యం. అయితే, అదే అనుకున్న‌ది కాక‌పోతే.. ఇ బ్బందులు త‌ప్ప‌వు! ఇప్పుడు వైసీపీ అధినేత‌, ఏపీ సీఎం జ‌గ‌న్ విష‌యంలోనూ ఇలాంటి ప‌రిస్థితే క‌నిపి స్తోంది. ఆయ‌న అనుకున్న‌ది ఒక్క‌టి కూడా ఇప్ప‌టి వ‌ర‌కు సాకారం కాలేదు. అంటే… కీల‌క‌మైన విష‌యా ల్లో జ‌గ న్ ప‌ట్టుబ‌ట్టి సాధించుకుంటాన‌ని చెప్పిన అంశాలు కూడా ముందుకు సాగ‌లేదు. వీటిలో కీల‌క‌మైన శాస‌న మండ‌లి ర‌ద్దు, మూడు రాజ‌ధానులు, పేద‌ల‌కు ఇళ్లు వంటి విష‌యాలు ఇప్ప‌ట్లో ముందుకు సాగేలా క‌నిపిం చ‌డం లేదు.

నిజానికి సీఆర్‌డీఏ ర‌ద్దు బిల్లు, మూడు రాజ‌ధానుల ఏర్పాటుకు సంబంధించిన వికేంద్రీక‌ర‌ణ బిల్లుల‌ను శాస‌న మండ‌లిలో టీడీపీ అడ్డ‌గించింద‌నే కార‌ణంగా జ‌గ‌న్ ఏకంగా మండ‌లిని ర‌ద్దు చేస్తూ.. తీర్మానం చేశా రు. దీనిని కేంద్రానికి పంపారు. ప్ర‌స్తుతం సోమ‌వారంతో ముగిసిన పార్ల‌మెంటు బ‌డ్జెట్ స‌మావేశాల్లోనే మం డ‌లి ర‌ద్దు బిల్లును కేంద్రం ఆమోదిస్తుంద‌ని జ‌గ‌న్ ఎంతో ఆశ పెట్టుకున్నారు. కానీ, ఫ‌లితం లేకుండా పోయింది. ఈ బిల్లు ఊసు లేకుండానే పార్ల‌మెంటు నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డింది. మ‌ళ్లీ ఆగ‌స్టు, సెప్టెం బ‌రు వ‌ర‌కు స‌భ స‌మావేశం అయ్యే ప‌రిస్థితి లేదు.

ఇక‌, మూడు రాజ‌ధానుల విష‌యం కూడా ఇప్ప‌ట్లో తేలేలా క‌నిపించడం లేదు. ప్ర‌స్తుతం దీనికి సంబం ధించి సెల‌క్ట్ క‌మిటీ వివాదం పెండింగ్‌లోనే ఉంది. మ‌రో రెండు మాసాలు ఆగాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇక‌, పేద‌ల‌కు ఇళ్ల విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌ధానిలో సేక‌రించిన భూములు కానీ, రాజ‌ధానిలో పేద ల‌కు ఇస్తామ‌ని జ‌గ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న‌ను కానీ హైకోర్టు స‌మ‌ర్ధించ‌క‌పోవ‌డంతో ప్ర‌భుతత్వానికి ఇబ్బందిక‌ర ప‌రిస్తితి ఏర్ప‌డింది. ఒక‌ప‌క్క‌, పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాలు పంపిణీ చేస్తామ‌న్న గ‌డువు కూడా క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు హైకోర్టు తీర్పు మేర‌కువారికి వేరే చోట స్థ‌లాల సేక‌ర‌ణ మ‌రో త‌ల‌నొప్పిగా మారే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వానికి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి మాదిరిగా ప‌రిస్థితి మారింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

అన్ని లోతులు.. గోతులు.. ఇప్పుడు న‌డ‌క ఎలా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts