విచిత్రం: ఓ ఎం‌పి‌టి‌సి స్థానంలో వైసీపీ-టీడీపీ కలిసి పోటీ…

March 13, 2020 at 12:19 pm

రాష్ట్రంలో అధికార వైసీపీ-ప్రతిపక్ష టీడీపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనే విషయం తెలిసిందే. అయితే ఉప్పు-నిప్పులాగా ఈ రెండు పార్టీలు ఓ ఎం‌పి‌టి‌సి స్థానంలో కలిసి పోటీ చేయడం విచిత్రంగా అనిపిస్తోంది. మామూలుగా అయితే చాలాచోట్ల ప్రతిపక్ష టీడీపీ నేతలు వైసీపీలోకి వెళ్ళిపోయి, ఆ పార్టీకి మద్ధతు ఇస్తున్నారు. కానీ గుంటూరు జిల్లాలోని వట్టిచెరుకూరు మండలంలో వైసీపీ-టీడీపీలు కలిసిపోయాయి.

ముట్లూరు ఎంపీటీసీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. స్థానిక పరిస్థితులు నేపథ్యంలో అంతా కలిసి కట్టుగా ఉండాలనే ఉద్దేశంతో, ఆ వూరులో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా టీడీపీ నేత, మాజీ ఎంపీపీ పూనాటి రమేష్‌ వైసీపీకి మద్ధతు ఇస్తున్నారు. అయితే వైసీపీతో టీడీపీ కలవడంపై అదే గ్రామంలోని మరో టీడీపీ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇలా కలిసి పోటీ చేస్తున్న విషయాన్ని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీని వైసీపీకి అమ్ముకుంటున్నారని మాజీ ఎంపీపీపై ఫిర్యాదు చేశారు. మరి ఈ విషయాన్ని జయదేవ్ పట్టించుకుంటారా? లేక వదిలేస్తారా? అనేది చూడాలి.

విచిత్రం: ఓ ఎం‌పి‌టి‌సి స్థానంలో వైసీపీ-టీడీపీ కలిసి పోటీ…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts