అన్నా చెల్లెళ్లు ఇద్ద‌రూ కామం కోసం అంత ప‌నికి ఒడిగ‌ట్టారా?

April 4, 2020 at 1:14 pm

మంచుకైనా క‌నిపించ‌డంలేదు మాన‌వ సంబంధాలు అన్న‌ట్లు ఉంటున్నాయి ఈ స‌మాజంలో బంధాలు. బంధాలు అనుబంధాలు, వాయి వ‌ర‌స ఇలాంటి వేమి కూడా ఎవ్వ‌రూ పెద్ద‌గా పాటించ‌డం లేదు. ఎవ‌రి ఇష్ట‌మొచ్చిన‌ట్లు వారు ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఐదు నిముషాల సుఖం కోసం ఏమి చెయ్య‌డానికైనా వెన‌కాడ‌డంలేదు. ప్రాణాల‌ను సైతం ఆలోచించ‌కుండా తీసేస్తున్నారు. బంధాలు అనుబంధాల‌కు అస‌లు విలువివ్వ‌డం లేదు. పడక సుఖం కోసం కొందరు పశువుల్లా ప్ర‌వ‌ర్తిస్తున్నారు ఒకొక్క‌రు. కట్టుకున్న వాళ్లనే దారుణంగా హ‌త‌మార్చేస్తున్నారు. ఇలాంటి దారుణమైన ఘ‌ట‌నే ఒక‌టి ఉత్తర్ ప్రదేశ్‌లో ఆగ్రాలో చోటుచేసుకుంది.

ఆగ్రాలోని విక్రమ్ ఠాకూర్ నోయిడాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య రవీనా అలియాస్ రాణి, ఏడాదిన్నర కొడుకు ఉన్నారు. కరోనా నేపథ్యంలో గత పదిహేను రోజుల నుంచి భార్యాపిల్లలతో సహా విక్రమ్ త‌న సొంత ఊరికి వ‌చ్చాడు. అతని ఇంటికి పక్కనే ఉండే రవీనా అన్న ప్రతాప్ నివాసం ఉంటున్నాడు. అయితే ఈ నేప‌ధ్యంలో ప్రతాప్, రవీనా కొద్దికాలంగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారు. విక్రమ్ లేకుండా చూసి వీరిద్ద‌రూ ఎప్పుడూ అదే ప‌నిగా శృంగారంలో మునిగి తేలుతున్నారు. అయితే తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్త విక్రమ్‌ని సైతం చంపేయాలని ప్లాన్ చేసుకున్నారు ఈ అన్నాచెల్లెళ్లు. భర్త నిద్ర‌పోతున్న స‌మ‌యం చూసి కత్తితో గొంతుకోసి కిరాతకంగా అత‌నిని హత్య చేశారు.

దీంతో రక్తపు మడుగులో మంచం పై పడి ఉన్న విక్రమ్‌ని చూసిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు వెంట‌నే సంఘటన స్థలానికి చేరుకుని కేసును ద‌ర్యాప్తు చేప‌ట్టారు. వెంట‌నే జ‌రిగిన ఘ‌ట‌న‌కి సంబంధించి ఒకొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. అన్న వరసయ్యే ప్రియుడితో కలసి చేసే ప‌నుల‌కి పోలీసులే ఆశ్చ‌ర్య‌పోయారు. భార్యే ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించి పోలీసులు నోరెళ్ళ‌బెట్టారు. ఆమె అన్న ప్రతాప్ పరారీలో ఉన్నాడు. నిందితురాలు రవీనా పోలీసు విచారణకు సహకరించడం లేదని.. పరారీలో ఉన్న ప్రతాప్ కోసం గాలిస్తున్నామని.. అన్ని ప‌ట్టుకోగానే విష‌యాల‌న్నీ కూపీ లాగుతామ‌ని పోలీసులు తెలిపారు.

అన్నా చెల్లెళ్లు ఇద్ద‌రూ కామం కోసం అంత ప‌నికి ఒడిగ‌ట్టారా?
0 votes, 0.00 avg. rating (0% score)