అనసూయ ‘బేకర్’ డైలాగ్ వాళ్లకేనా …?

April 22, 2020 at 3:30 pm

క‌రోనా కార‌ణంగా రెండు ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్‌ను విధించిన విష‌యం తెలిసిందే. దీంతో సామాన్యుల నుంచి సెల‌బ్రెటీల వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రూ ఇళ్ళ‌కే ప‌రిమిత‌మ‌య్యారు. దీంతో ప్ర‌తి ఒక్క‌రూ సోష‌ల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. రోజు వాళ్ళు చేసే ప‌నుల‌న్నీ కూడా సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతూ ఎప్ప‌టికప్పుడు ఫ్యాన్స్‌కి ద‌గ్గ‌ర‌గా ఉంటున్నారు. హాట్ అండ్ క్రేజీ యాంక‌ర్ అన‌సూయ త‌న ట్విట‌ర్ ఎకౌంట్ ద్వారా చేసిన ట్వీట్లు ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీశాయి. కొంత మంది ఎవ‌రిక‌న్నా హెల్ప్ చేసి అవి వీడియోలు తీసి మ‌రీ ట్విట‌ర్ ఎకౌంట్‌లో పెడుతున్నారు. అయితే దాంతో చాలా మంది హెల్ప్ చేసిన వారికి ప్ర‌శంస‌లు తెలుపుతున్నారు. అలాగే సాయం చేయ‌ని వారిపై సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే కొంద‌రు అన‌సూయ‌ను సైతం ట్రోల్ చేయ‌డంతో ఆమెకు ఒళ్ళు మండింది. దాంతో ఆమె త‌న ట్విట్ట‌ర్ అక్కౌంట్లో ఘాటుగా స్పందించింది.

ముందుగా ఆమె చాలా మంది మీరు ఏం హెల్ఫ్ చేయ‌డం లేదు… ఇంట్లో కూర్చొంటున్నారు అని ప్ర‌శ్నిస్తున్నార‌ని.. వీళ్లు ఏదైనా సాయం చేసిన‌ట్టు ఫొటోలు పెడితేనా న‌మ్ముతారు ? లేదంటేన‌మ్మ‌రా అంటోంది. వీళ్ల‌కు ఏం అర్థం కాద‌ని ట్వీట్ చేసింది. ఆ వెంట‌నే త‌న ట్వీట్‌కు తానే రిప్లే ఇచ్చుకుంటూ ఎవ‌రికి సాయం అందాలో వారికి అందుతుంది.. ఎవ‌రికి తెలియాలో వారికి తెలుస్తుంది.. మిగిలింది అంతా బేకార్ ముచ్చ‌ట‌ని పోస్ట్ చేసింది. దీనిని బ‌ట్టి తాను సాయం చేయ‌డం లేద‌ని విమ‌ర్శ‌లు గుప్పుమ‌న్నాయి. దీంతో ఇది కాస్త రూటు మారి కొంద‌రు గోరంత సాయం చేసి కొండ‌త డ‌బ్బాలు కొట్టుకునే వారిని టార్గెట్‌గా చేసుకుని ఆమె సైటైర్లు వేసింద‌న్న చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయి. ఈ బేకార్ డైలాగ్ కూడా వాళ్ల‌కే అని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి అన‌సూయ‌ని బాగానే ట్రోల్ చేశారు మ‌న నెటిజ‌న్లు.

అనసూయ ‘బేకర్’ డైలాగ్ వాళ్లకేనా …?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts