యాంకర్ సుమ ఇంట్లో విషాదం.. ఏం జ‌రిగిందంటే..?

April 6, 2020 at 5:01 pm

యాంక‌ర్ సుమ క‌న‌కాల ఇంటి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాజీవ్ కనకాల సోదరి, సుమ ఆడపడుచు శ్రీలక్ష్మీ కనకాల ఇవాళ క‌న్ను మూశారు. శ్రీలక్ష్మి మరణ వార్త తెలిసిన వెంటనే సుమ, రాజీవ్ కనకాల బంధువులు, వారి సన్నిహితులు పెద్ద సంఖ్యలో వారింటికి చేరుకున్నారు. ప్రముఖ నటుడు దర్శకుడు దేవదాస్ కనకాల ఏకైక కుమార్తె శ్రీలక్ష్మి. ఆమె కూడా అనేక టీవీ సీరియల్స్‌లో నటించారు.

ఈమె ముందు దూరదర్శన్ లో వచ్చిన రాజశేఖర చరితము సీరియల్ ద్వారా నటనారంగంలోకి అడుగుపెట్టారు. ఇక శ్రీ‌ల‌క్ష్మికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. ప్రముఖ జర్నలిస్టు పెద్ద రామారావు ఈమె భర్త. అయితే శ్రీ లక్ష్మి కొధ్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతుడటంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. కాని, కొద్దిసేపటి క్రితమే శ్రీలక్ష్మి మరణించారు.

కాగా, గత యేడాది ఆగష్టులో రాజీవ్ కనకాల తండ్రి దేవదాసు కనకాల కన్నుమూసారు. అంతకు రెండేళ్ల క్రితం దేవదాసు కనకాల భార్య లక్ష్మీ కనకాల మృతి చెందారు. తాజాగా రాజీవ్ కనకాల కుటుంబంలో ఆమె సోదరి శ్రీలక్ష్మీ కనకాల మృతి చెందింది. వరుసగా కనకాల కుటుంబంలో మూడో మరణం చోటు చేసుకోవడం విషాదకరం.

యాంకర్ సుమ ఇంట్లో విషాదం.. ఏం జ‌రిగిందంటే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts