తెలుగురాష్ర్టాల్లో లాక్‌డౌన్ కొన‌సాగే జిల్లాలు ఇవే..?

April 6, 2020 at 11:51 am

క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి తెలుగు రాష్ర్టాల‌ను అత‌లాకుత‌లం చేస్తున్న‌ది. రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు దేశవ్యాప్తంగా 4000 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 118 మంది మృతి చెందారు. ఇక ఏపీలో 266 కేసులు, తెలంగాణ‌లో 300 కేసులు న‌మోద‌య్యాయి. తాజాగా ఏపీలో 12గంట‌ల్లోనే 26 కేసులు వెలుగు చూడ‌డం ప‌రిస్థితి తీవ్ర‌త‌ను తెలియ‌జేస్తున్న‌ది. మ‌రోవైపు వైర‌స్ క‌ట్ట‌డి కోసం ప్ర‌భుత్వం, అధికార యంత్రాంగం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న‌ది. మ‌రోవైపు ప‌లు ప్రైవేట్ కంపెనీలు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు త‌మ‌కు తోచిన సాయాన్ని అందిస్తూ, ఆర్థికంగా విరాళాల‌ను అందిస్తూ ఏపీ స‌ర్కారుకు అండ‌గా నిలుస్తున్నాయి.

ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే రెండు వార‌లుగా కేంద్ర, రాష్ర్ట ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్‌ను ప‌క‌డ్బందీగా అమ‌లు చేస్తున్నాయి. అయితే కొంత‌లో వైర‌స్‌ను క‌ట్ట‌డి చేయ‌గ‌లిగినా ఆర్థిక వ్య‌వ‌స్థ పూర్తిగా కుదేల‌వుతున్న ప‌రిస్థితి నెల‌కొన్న‌ది. నిత్యావ‌స‌రాలు ల‌భించ‌క‌, ల‌భించినా ఆకాశ‌న్నంటుతున్న ద‌ర‌ల‌ను భ‌రించ‌లేక సామాన్యులు నానా క‌ష్టాల‌ను ప‌డుతున్నారు. మ‌రోవైపు ప్రైవేట్ సంస్థ‌లు త‌మ ఉద్యోగుల జీతాల్లో కోత‌లు పెట్టాల్సిన ప‌రిస్థితి నెల‌కొన్న‌ది. ఈ నేప‌థ్యంలో లాక్‌డౌన్‌ను ఎత్తివేయాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తున్న‌ది. అందులో కొన్ని జిల్లాల‌ను మిన‌హాయించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తున్న‌ది. తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఎత్తివేసినా, క‌రోనా వైర‌స్ వ్యాప్తి ఎక్కువగా ఉండి, కేంద్రం ఇప్ప‌టికే రెడ్ జోన్ గా నోటిఫై చేసిన జిల్లాల్లో లాక్ డౌన్ ఏప్రిల్ నెలాఖ‌రు వ‌ర‌కు పొడిగించే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు విన‌వ‌స్తున్నాయి. తెలంగాణ‌లో హైద‌రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు అంటే గ్రేటర్ హైదరాబాద్ ప్రాంత ప‌రిధిలో లాక్ డౌన్ కొన‌సాగించేందుకే కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు మొగ్గుచూపుతున్నట్లు స‌మాచారం. ఇక ఆంధ్రప్రదేశ్ లో విశాఖ, చిత్తూర్,తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, క‌ర్నూల్ జిల్లాల్లో లాక్ డౌన్ను ఏప్రిల్ 30 వరకు పొడిగించే అవకాశం ఉందని అధికార వ‌ర్గాలు తెలుపుతున్నాయి. ఈ జిల్లాల్లో ఇప్ప‌టికీ ప్ర‌తి రోజూ ప‌దుల సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోద‌వుతుండ‌డంతో… వారి కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితుల‌ను ట్రేస్ చేసే ప‌నిలో అధికారులు నిమ‌గ్న‌మ‌య్యారు.

తెలుగురాష్ర్టాల్లో లాక్‌డౌన్ కొన‌సాగే జిల్లాలు ఇవే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts