మ‌ళ్లీ సంక్రాంతిపైనే క‌న్నేసిన అనిల్ రావిపూడి..!!

April 6, 2020 at 3:22 pm

అనిల్ రావిపూడి.. ఇప్ప‌టికి తీసింది అతి త‌క్కువ సినిమాలే అయినా.. వ‌రస స‌క్సెస్‌ల‌తో స్టార్ డైరెక్ట‌ర్ల చెంత చేరాడు. ఒక‌టి కాదు రెండు కాదు.. వ‌ర‌స‌గా ఐదు హిట్ సినిమాల‌తో ప్ర‌స్తుతం మంచి జోరు మీద ఉన్నాడు. యూత్ .. మాస్ .. ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని కథలను సిద్ధం చేసుకోవడంలోను, కామెడీకి ప్రాధాన్యతనిస్తూ నాన్ స్టాప్ గా నవ్వించడంలోను ఆయన సిద్ధహస్తుడు. ఆయన తెరకెక్కించిన ‘ఎఫ్ 2’ క్రితం ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని సాధించింది.

ఆ తరువాత చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేసింది. మ‌రియు సరిలేరు నీకెవ్వరు చిత్రం 130 కోట్లకు షేర్ వసూలు చేసింది. మహేష్ కెరీర్ బెస్ట్ కలెక్టన్స్ సాధించిన ఈ చిత్రం టాలీవుడ్ టాప్ గ్రాస్ సాధించిన చిత్రాలలో ఒకటిగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన తన తదుపరి సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దింపాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.

అనిల్ రావిపూడి ప్ర‌స్తుతం ఎఫ్2 కి సీక్వెల్ గా ఎఫ్3 సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం స్క్రిప్ట్ సిద్ధం చేస్తుండగా అది కూడా చివరి దశకు చేరినట్లు తెలుస్తుంది. దీనితో లాక్ డౌన్ పూర్తయిన తరువాత వీలైనంత త్వరగా ఈ మూవీ పట్టాలెక్కించాలని అతను ప్రయత్నిస్తున్నాడు. మ‌ళ్లీ వచ్చే సంక్రాంతిని దృష్టిలో పెట్టుకునే అనిల్ రావిపూడి రంగంలోకి దిగుతున్నాడని తెలుస్తుంది. మ‌రి ఈ సారి కూడా ఈయ‌న స‌క్సెస్ అవుతాడా.. లేదా.. అన్నది చూడాలి.

మ‌ళ్లీ సంక్రాంతిపైనే క‌న్నేసిన అనిల్ రావిపూడి..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts