లాక్ డౌన్ కే ‘లాక్ ‘…బాలయ్య మజాకా !

April 4, 2020 at 11:31 am

క‌రోనా కోర‌లు చాచింది. ప్ర‌పంచ‌మంతా లాక్‌డ‌వున్‌ కొన‌సాగుతుంది. అయితే కొంద‌రు మాత్రం ఇంకా కాస్త అప్ర‌మ‌త్తంగానే ఉంటున్నారు. త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోకుండా ఇష్ట‌మొచ్చిన‌ట్లు రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇది కేవ‌లం వారికోస‌మే అన్న క‌నీస ఆలోచ‌న లేకుండా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. అందుకు ప్ర‌భుత్వాలు కూడా దానికి త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటుంది. జనాలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు, పోలీసులు పదే, పదే మొత్తుకుని చెబుతున్నారు. నిత్యావసరాలు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు కొంత సమయాన్ని కేటాయిస్తున్నారు. అయితే అన‌వ‌స‌రంగా బ‌య‌ట‌కు వ‌చ్చి ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటున్నారు. కానీ కొందరు ఆకతాయిలు మాత్రం నిబంధనలు గాలికొదిలేసి రోడ్లెక్కుతున్నారు. ఇలాంటి వాళ్లతో అత్యవసర పనులపై బయటకు వచ్చినవారు ఎన్నో ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. దీంతో అధికారులు, పోలీసులు రూటు మారుస్తున్నారు లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేసేందుకు త‌గిన క‌ఠిన చర్యలు తీసుకుంటున్నారు.

ఇటీవ‌లె అనంతపురం జిల్లా లేపాక్షిలో పదేళ్ల బాలుడికి వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో స్థానికంగా ప్రజలంద‌రినీ అలర్ట్ చేశారు. జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించినా ప్రజలు మాత్రం పట్టించుకోకపోవటంతో అధికారులు కొత్త రూట్‌లో వెళుతున్నారు. ఇళ్లకు తాళాలు వేసి జనాలు బయటకు రాకుండా చేస్తున్నారు. కేవలం ఉదయం, సాయంత్రం తాగునీరు, పాలు, ఇతర నిత్యావసరాలు అవసరమైనవారికి సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

లేపాక్షిలో ఎవరైన నిబంధనలను గ‌నుక‌ అతిక్రమించి వీధుల్లోకి వస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వంటున్నారు. అటు చిలమత్తూరులోనూ ఇలాగే ఇళ్లకు తాళాలు వేస్తున్నారు. జనాలు నిబంధనల్ని పట్టించుకోవడం లేదని..దానికి ఏం చేయాలో కూడా అర్దం కాని ప‌రిస్థితుల్లో ఆఖ‌రికి ఇలాంటి నిర్ణ‌యాన్ని తీసుకున్నారు అధికారులు.

లాక్ డౌన్ కే ‘లాక్ ‘…బాలయ్య మజాకా !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts