బైక్‌నే క‌రోనా ప్ర‌చార ర‌ధం చేశాడు ఈ తాపీ మేస్త్రీ

April 29, 2020 at 7:52 pm

క‌రోనా మ‌హ‌మ్మారిని పాల‌ద్రోలే ప‌నిలో ప్ర‌తి ఒక్క‌రూ ఇళ్ళ‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఎవ్వ‌రికి ప‌నులు లేక చాలా మంది ఆర్ధికంగా ఇబ్బంది ప‌డుతున్నారు. ఇక చిన్న చిన్న కూలి నాలి చేసుకునేవారికి ఈ లాక్‌డౌన్ ఒక శాపంలా మారింది. చాలా మంది కూలి ప‌ని చేసుకుని ఏ రోజుది ఆరోజు గ‌డుపుకునేవారంతా ఆక‌లితో అల‌మ‌టిస్తున్నారు. అయితే ఓ తాపీ మేస్త్రీ మాత్రం ఇబ్బందులు పడుతున్నా…తన వంతుగా కృషిగా ప్రజలకు కరోనా వైరస్ పై అవగాహన కల్పిస్తున్నాడు. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరుకు చెందిన బాబ్జీ తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా పనులన్నీ నిలిచిపోయాయి. అయితే బాబ్జీ మాత్రం తన బైక్ ను కరోనా ప్రచార రథంగా ముస్తాబు చేసి…ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు.

ఎంతో విజ్ఞ‌త‌తో చేసే ఈ ప‌నికి అంద‌రూ బాబ్జీని శ‌భాష్ అంటున్నారు. మొదట విశాఖపట్నంలో ఆరు రోజులపాటు ప్రచారం నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాడు. జిల్లా కేంద్రం కాకినాడ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టాడు. లౌక్ డౌన్ సడలించే వరకు కరోనా పై ప్రజలలో అవగాహన కల్పిస్తానని చెప్పాడు బాబ్జి. ప్ర‌తిరోజు త‌న బైక్‌ని వేసుకుని ఈ వ్యాధి పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నాడు.

బైక్‌నే క‌రోనా ప్ర‌చార ర‌ధం చేశాడు ఈ తాపీ మేస్త్రీ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts