కేంద్రం నుంచి ఏపీకి భారీ నిధులు..!!

April 4, 2020 at 3:11 pm

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ భార‌త్‌లో సైతం విజృభిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో కేంద్రం ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆసరాగా నిలిచింది. రాష్ట్ర విపత్తు ప్రమాద నిర్వహణ నిధి (ఎస్డీఆర్‌ఎంఎఫ్‌) కింద అత్యవసర విడుదల చేసింది. లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రూ.11,092 కోట్ల నిధులను విడుదల చేసింది. రాష్ట్రాల్లో విపత్తుల నిర్వహణ కోసం ప్రతి ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులను కేటాయిస్తుంది.

2020 – 21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అడ్వాన్స్‌గా విడుదల చేస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఇది తొలివిడుతగా భావించాలి. ఇక ఇతర రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాలకు కూడా నిధులు విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌కు అత్యధిక నిధులు లభించాయి. విపత్తు నివారణ కోసం ప్రత్యేకంగా ఏపీకి రూ.559.5 కోట్లు, తెలంగాణకు 224.5 కోట్లు విడుదల చేసింది కేంద్రం. అలాగే15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు.. 14 రాష్ట్రాలకు రూ. 6,195 కోట్లను విడుదల చేసింది. లోటు ఉన్న రాష్ట్రాలకు ఈ మొత్తం పంచుతారు. ఏపీకి రూ.491.14 కోట్లు విడుదలయ్యాయి.

తెలంగాణ లోటు ఉన్న రాష్ట్రం కాదు కాబట్టి.. ఎలాంటి సాయమూ లభించలేదు. ఇక మొత్తంగా చూసుకుంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మాత్రం కేంద్రం నుంచి వెయ్యి కోట్ల వరకూ సాయం అందింది. ఇక తెలంగాణ‌కు మాత్రం అందులో పావు వంతు ల‌భించింది. ఈ నిధులను క్వారంటైన్‌ కేంద్రాల ఏర్పాటు సహా ఇతర వ్యవహారాల కోసం ఉపయోగించుకోవచ్చని తెలిపింది. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ వీడి యో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు అనంతరం ఈ నిధులు విడుదల చేయడం గమనార్హం. ఏదైతేనేం తెలుగు రాష్ట్రాలకు మాత్రం కేంద్రం నుంచి భారీగా నిధులు ల‌భించాయి.

కేంద్రం నుంచి ఏపీకి భారీ నిధులు..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts