జ‌న‌సేన పై చిరు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

April 27, 2020 at 10:11 am

మెగాస్టార్ చిరంజీవి తొలిసారి తమ్ముడు పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ పై స్పందించారు. ప్రజారాజ్యం అనుభవాల నుండే తమ్ముడు పవన్ జనసేన పెట్టడం.. పవన్ కళ్యాణ్ నమ్మిన దారిలోకి వెళ్లి తానేమి సలహాలు ఇవ్వగలనని అంటూ చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మెగాస్టార్ చిరంజీవి అడుగు జాడల్లోనే పవన్ కూడా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. అలాగే చిరు సినిమాల నుండి రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పుడు కూడా పవవ్ చిరు వెంట నడిచారు. పార్టీ యువజన విభాగనేతగా ఉన్నారు. అయితే 2009 ఎన్నికల ఫలితాల తర్వాత చిరు ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.

ఇక ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలపై దృష్టి సారించిన చిరు.. పవన్ కళ్యాణ్ జనసేన గురించి చాలా విషయాలు చెప్పారు.
ప్రజారాజ్యం స్థాపించి, ఎన్నికల్లో పోటీ చేయడం అన్ని అనుభవాల నుండి పవన్ జనసేన స్థాపించారట. పవన్ కు నచ్చిన దారిలో వెళ్తున్నాడు, దానిపై తాను ఏమీ సలహాలు ఇవ్వనని స్పష్టం చేశారు. పవన్ ఇక తమ దారులు వేరైనా గమ్యం ఒక్కటే అని చెప్పిన పవన్ తమ్ముడు పవన్ ను కలిసినప్పుడు రాజకీయాలు మాత్రం మాట్లాడము అని అన్నారు.

జ‌న‌సేన పై చిరు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts