ఒక వేళ ఇదే జరిగితే మెగా ఫ్యాన్స్ చిరకాల కోరిక తీరినట్టే!

April 6, 2020 at 9:17 am

కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి ఆచార్య చిత్రం వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో చ‌ర‌ణ్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. చ‌ర‌ణ్ పాత్ర‌కోసం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప‌ర్మిష‌న్ కోసం వెయిటింగ్ అట‌. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీ గా ఉన్న చరణ్ ఓ నెల రోజులు చిరు సినిమా కోసం డేట్స్ కేటాయించడం అనేది, కష్టమనే చెప్పాలి. అందులోనూ ప్ర‌స్తుతం ఉన్న క‌రోనా ప్ర‌భావంతో అన్ని సినిమాలు చాలా ఆల‌స్య‌మ‌య్యే ప‌రిస్థితి అయితే నెల‌కొనింది. ఇక రాజ‌మౌళి ప‌ర్మిష‌న్ ఎందుకంటే ఇది జస్ట్ క్యామియో రోల్ కాదు. దాదాపు అరగంట నిడివి గలిగిన కీలకమైన పాత్ర‌. అయితే సినిమాలో ఈ పాత్ర‌కి ప్రాధాన్య‌త చాలా ఎక్కువ‌ట‌. అంతే కాక ఈ పాత్ర‌లో చ‌ర‌ణ్ చ‌నిపోతాడ‌ని తెలిసింది. మ‌రి అలాంటి పాత్ర‌కి వేరే ఏ హీరో అయినా స‌రే ఒప్పుకోవ‌డం కాస్త క‌ష్ట‌మే అని చెప్పాలి.

ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఇప్ప‌టికే వాయిదాల నేప‌ధ్యంలో జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. చరణ్ వేరే మూవీ షూటింగ్ లో పాల్గొనడానికి రాజమౌళి అనుమతి ఇవ్వకపోవచ్చు. ఒకసారి వాయిదాపడిన ఆర్ ఆర్ ఆర్ ని జనవరి 2021కి వాయిదా వేశారు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడడంతో పాటు, ఎప్పుడు మళ్ళీ మొదలవుతుందో కూడా ఎవ్వ‌రికి తెలియని పరిస్థితి ఏర్ప‌డింది.

ఒక వేళ చ‌ర‌ణ్‌ నటించ లేకపోతే ఆ స్థానంలో పవన్ చేయడం కరెక్ట్ అని చిరు అండ్ కొరటాల భావిస్తున్నారట. ఇది ఎటూ సోషల్ కాన్సెప్ట్ సినిమా కాబ‌ట్టి అందులోనూ అన్న‌య్య న‌టించే సినిమాలో త‌మ్ముడు క‌చ్చితంగా చేయ‌డానికి ఒప్పుకుంటాడు అని కొర‌టాల‌, చిరు భావిస్తున్నార‌ట‌. ఒక వేళ ఇదే జరిగితే మెగా ఫ్యాన్స్ చిరకాల కోరిక తీరినట్టే. చిరు, పవన్ కలిసి మల్టీ స్టారర్ చేయాలని ఎప్పటికి నుండో ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అది ఇలా సాధ్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మ‌రి తెర మీద అన్న‌ద‌మ్ములిద్ద‌ర్నీ చూస్తే ఫ్యాన్స్‌కి పండ‌గే పండ‌గ‌. మెగా ఫ్యాన్స్‌కి తెర మీద చూడ‌డానికి రెండు క‌ళ్ళూ చూడ‌డానికి స‌రిపోవు.

ఒక వేళ ఇదే జరిగితే మెగా ఫ్యాన్స్ చిరకాల కోరిక తీరినట్టే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts