చిరు పై ఏడుస్తున్న మెగా ఫాన్స్ ..ఎందుకంటే ?

April 22, 2020 at 5:38 pm

ప్ర‌స్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌ని స్టార్ట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి తెగ ఊపు మీదున్నారు. ఒక సినిమా వెనుక ఒక సినిమా చేసుకుంటూ చాలా ఫాస్ట్‌గా దూసుకెళుతున్నారు. చిరు 150 వ చిత్రం త‌ర్వాత ఆయ‌న సినిమా పై ఇంట్ర‌స్ట్ ఎక్కువ‌గా పెట్టారు. వ‌రుస‌గా అదే ప‌నిలో ఉంటూ ఇటీవ‌లో సైరా చిత్రంలో న‌టించి విజ‌యం సాధించారు. ఇప్పుడాయ‌న కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య చిత్రంలో న‌టిస్తున్నారు. లాక్‌డ‌వున్ కార‌ణంగా షూటింగ్ కు కాస్త బ్రేక్ ప‌డింది. ఇక ఇదిలా ఉంటే… ప్ర‌స్తుతం చిరంజీవి సోష‌ల్ మీడియాలో అడుగు పెట్టిన ద‌గ్గ‌ర నుంచి చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇక ఫ్యాన్స్ కూడా వాటికి రిప్లై ఇస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే చిరంజీవి మెహ‌ర్‌ర‌మేష్‌తో సినిమా చేయ‌నున్న‌ట్లు ఆయ‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు. దీంతో అసలు చిక్కంతా మొద‌ల‌యింది.

చిరు మెహ‌ర్ ర‌మేష్ పేరు చెప్ప‌గానే ఫ్యాన్స్ ఆవేశంతో ఊగిపోయారు. మీకు ద‌ణ్ణం పెడ‌తాం మ‌హానుభావ ద‌య‌చేసి ఆ ద‌ర్శ‌కుడితో మాత్రం సినిమా చేయొద్దంటూ తెగ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. గ‌తంలో ఆయ‌న తీసిన సినిమా ట్రాక్ రికార్డు ఒక‌సారి చూడ‌మంటున్నారు. ఎన్టీఆర్ కు కంత్రి, శక్తి రూపంలో 2 డిజాస్టర్లు ఇచ్చాడు. ఇక వెంకటేష్ కు షాడో రూపంలో ఇంకో డిజాస్టర్ ఇచ్చాడు. షాడో తర్వాత మెహర్ తో సినిమా చేయడానికి హీరోలంతా వణికిపోయారంటే ఆ సినిమా రిజల్ట్-ఇంపాక్ట్ అర్థం చేసుకోవచ్చు. అలాంటి దర్శకుడితో చిరంజీవి సినిమా ఎనౌన్స్ చేయడాన్ని ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు.

అభిమానుంతా కూడా చిరు పెద్ద ద‌ర్శ‌కుల‌తో చేసి మంచి హిట్లు కొట్టాల‌ని కోరుకుంటుంటే ఆయ‌న మెహ‌ర్ పేరు చెప్పి బిగ్ షాక్ ఇచ్చారు. దీంతో నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. మెహర్ తో సినిమా చేయొద్దు మహాప్రభో అంటూ ఒకటే విన్నపాలు చేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్‌కి ఊర‌ట క‌లిగేందుకు మెగా కాంపౌండ్ నుంచి ఓ భ‌రోసా వ‌చ్చింది. ఘనంగా ప్రకటించిన త్రివిక్రమ్ తోనే చిరంజీవి ఇంకా సినిమా చేయలేదు. పైగా సుజీత్, బాబి సినిమాలు పూర్తవ్వాలి. ఈ గ్యాప్ లో మరో కొత్త ప్రాజెక్టు వచ్చి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబ‌ట్టి ఎవ్వ‌రూ టెన్ష‌న్ ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. దీంతో ఫ్యాన్స్ కాస్త కూల్ అయ్యారు.

చిరు పై ఏడుస్తున్న మెగా ఫాన్స్ ..ఎందుకంటే ?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts