జన్యుక్రమం మార్చుకుంటున్న క‌రోనా.. మ‌రి విరుగుడు కనిపెట్టేదెలా..?

April 4, 2020 at 10:08 am

చైనాలోని వూహాన్లో పుట్టుకొచ్చిన క‌రోనా వైర‌స్.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాలు విస్త‌రించింది. ఇప్ప‌టికే ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డి 59వేల 140మంది మ‌త్యువాత ప‌డ్డారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 11లక్షలకు చేరువలో ఉంది. అంటే ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 10లక్షల 98వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇక క‌రోనాకు వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో మ‌రింత త‌ల‌నొప్పిగా మారింది. కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నంలో శాస్త్రవేత్తలు తలమునకలై ఉన్నారు.

కరోనాకు మందు కనిపెట్టేశామని అమెరికాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్ర‌క‌టించారు కూడా. అయితే ఆ మందు వినియోగంలోకి రావాలంటే… హీనపక్షం సెప్టెంబర్ దాకా ఆగాల్సింది. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలార్ బయాలజీ(సీసీఎంబీ) మాజీ డైరెక్టర్ మోహనరావు ఓ పిడుగు లాంటి వార్త చెప్పారు. అదేంటంటే.. మిగిలిన ప్రాణుల మాదిరిగా కరోనా వైరస్ తనలోని జన్యు క్రమాన్ని మార్చేస్తుందట.

ఏ హానీకారక జీవిని అయినా నశించేలా చేయాలంటే.. దానిలోని జన్యు క్రమంపై దెబ్బ కొట్టే దిశగా మందును కనిపెడుతారు. మరి కరోనా వైరస్ ఎప్పటికప్పుడు తన జీన్స్ ను మార్చుకుంటూ పోతుంటే… దానికి విరుగుడును కనిపెట్టడం ఎప్పటికి సాధ్యమయ్యేనూ? అసలు సాధ్యపడుతుందా? అన్న అనుమానాలు వ్య‌క్తంఅవుతున్నాయి. అయితే కరోనా అయినా మిగిలిన ఏ జీవి అయినా తన జన్యు క్రమాన్ని మార్చుకుంటూ పోతున్నా… దానికి విరుగుడు కనిపెట్టడం అంత కష్టమైన పనేమీ కాకున్నా… అందుకు కొంత సమయం పడుతుందని మోహనరావు చెప్పుకొచ్చారు. ఏదేమైన‌ప్ప‌టికీ ఈయ‌న మాట‌లు బ‌ట్టీ చూస్తుంటే క‌రోనాకు విరుగుడు చాలా స‌మ‌య‌మే ప‌ట్టేలా క‌నిపిస్తుంది.

జన్యుక్రమం మార్చుకుంటున్న క‌రోనా.. మ‌రి విరుగుడు కనిపెట్టేదెలా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts