క‌రోనా దెబ్బ‌కు సెక్స్‌వ‌ర్క‌ర్ల ప‌రిస్ధితి ఎంత దారుణ‌మంటే?

April 6, 2020 at 5:17 pm

ప్ర‌పంచ‌మంతా ఒక్క‌సారిగా లాక్‌డౌన్‌లోకి వెళ్ళిపోయింది. ఎవ‌రికి వారు ఇళ్ళ‌కే ప‌రిమితమ‌య్యారు. క‌రోనా మ‌హ‌మ్మారి చాలా ఘోర‌మైన వ్యాధి కావ‌డంతో ఒక‌రి నుంచి మ‌రొక‌రికి సోకే అవ‌కాశం చాలా ఎక్కువ‌గా ఉంటుంది. ఈ లాక్‌డౌన్‌తో దేశంమంతా ఒక్క‌సారిగా చాలా మంది పేద‌లు అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నారు. లాక్ డౌన్ వల్ల ముంబైలోని రెడ్ లైట్ ప్రాంతమైన కామతిపురాలో సెక్స్ వర్కర్లు కూడా రోడ్డున పడ్డారు. ఏమి చెయ్యాలో అర్ధంకాని ప‌రిస్థితుల్లో పొట్ట‌కూటి కోసం ప‌డ‌పువృత్తి చేసే వారికి సైతం ఈ ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. త‌మ రోజూవారీ అవసరాలు కూడా తీర్చుకోవడానికి వారు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్జీవోలు చేసే సాయమే వీరికి ఇప్పుడు ఆధారంగా మారింది. వారిచ్చే భోజనం ప్యాకెట్లతోనే సెక్స్ వర్కర్లు కడుపు నింపుకుంటున్నారు.

ఎస్‌ఏఐ (సోషల్ యాక్టివిటీస్ ఇంటిగ్రేషన్) అనే ఎన్జీఓ యొక్క ప్రాజెక్ట్ మేనేజర్ అజిత్ బండేకర్ మాట్లాడుతూ.. ‘మేం ఇక్కడ కామతీపురాలో ఆహారాన్ని పంపిణీ చేస్తున్నామ‌న్నారు. ఒక వేళ మేం ఇక్కడ ఆహార ప్యాకెట్లను పంపిణీ చేయకపోతే వారికి తిండి తిన‌డం కూడా చాలా క‌ష్ట‌మ‌న్నారు. లాక్ డౌన్ వల్ల పోలీసులు వారిని ఆ ప్రాంతం నుంచి బయటకు కూడా రానీయడంలేదు’ అని అన్నారు.

ఈ ‘లాక్ డౌన్ వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుందని వారు నానా తంటాలు ప‌డుతున్నారు. చేతిలో డబ్బు లేక, తినడానికి తిండి లేక వాళ్ళు నానా తంటాలు ప‌డుతున్న విష‌యం తెలిసిందే. పేదలందరికి ఇచ్చినట్లు వాళ్ళ‌కు కూడా రేషన్ ఎందుకు ఇవ్వరంటూ వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ‌కు మాత్రం ఎటువంటి రేషన్ అందడంలేదంటున్నారు. ఎన్జీఓలు ఇచ్చే ఆహారమే మా అందరికి ఆధారంగా మారిందంటున్నారు. ప్రభుత్వం మాకు కూడా రేషన్ అందేలా చూడాలి’ అని ఓ సెక్స్ వర్కర్ తమ బాధను వ్యక్తం చేశారు. ఇక వాళ్ళ బాద‌లు వ‌ర్ణ‌నాతీతం అని చెప్పాలి.

క‌రోనా దెబ్బ‌కు సెక్స్‌వ‌ర్క‌ర్ల ప‌రిస్ధితి ఎంత దారుణ‌మంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts