క‌రోనా నుంచి సేప్ అయిన సింగర్.. అయినా పొంచి ఉన్న మరో ప్రమాదం..!!

April 6, 2020 at 11:58 am

బాలీవుడ్ సింగ‌ర్ క‌నికాక‌పూర్‌.. గ‌త కొన్ని రోజులుగా ఈ పేరు హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఇందుకు కార‌ణంగా ఆమెకు క‌రోనా వైర‌స్ సోక‌డ‌మే. అయితే ఆమె ఎట్టకేలకు డిశ్చార్జ్ అయ్యారు. ఆరోసారి కనికాకు జరిపిన పరీక్షల్లో కరోనా నెగిటివ్ అని రావడంతో ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు లక్నో వైద్యాధికారులు చెప్పారు. దాంతో కుటుంబ సభ్యులు కాస్త ఊరట చెందారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కనికాకపూర్ ను 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు.

యూకేలో పర్యటించి వచ్చిన కనికాకపూర్‌కు కరోనా వైరస్ సోకడంతో మార్చి 20వతేదీన ఆమెను లక్నో నగరంలోని సంజయ్ గాంధీ పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ లోని ఐసోలేషన్ గదికి తరలించి చికిత్స అందించారు. కాగా, మార్చి 9న లండన్‌ నుంచి వచ్చిన కనికా కపూర్‌ ఉత్తర ప్రదేశ్‌లోని హోటల్‌లో బస చేసింది. ఆ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులను ఆమె కలవడమే కాకుండా పార్టీ కూడా చేసుకున్నారు.

ఆమెకు కరోనా సోకినట్లు తేలడంతో సంచలనం రేగింది.. దాంతో పాటు ఆమెను కలిసిన వాళ్లను కూడా సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి పంపించారు. మరోవైపు కరోనాపై ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు పాటించకుండా.. కరోనా వచ్చిన తర్వాత కూడా పార్టీకి వచ్చినందుకు కనికాపై పోలీసులు కేసు నమోదు కూడా చేశారు. ఈ క్రమంలో కరోనా నుంచి బయటపడినా.. ఆమెను ఈ వ్యాధి మరో రూపంలో వెంటాడటం ఖాయమనే మాట వినిపిస్తున్నది.

క‌రోనా నుంచి సేప్ అయిన సింగర్.. అయినా పొంచి ఉన్న మరో ప్రమాదం..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts