కీర్తి సురేష్ కి పెళ్లి ఫిక్స్ .. వ‌రుడెవ‌రో తెలుసా..?

April 4, 2020 at 10:44 am

కీర్తి సురేష్.. పెద్ద‌గా ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. నేను శైలజ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన‌ మలయాళ న‌టి కీర్తి సురేష్..మొదటి సినిమాతోనే అటు అందం ఇటు అభినయంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత నేను లోక‌ల్ సినిమాతోనూ మంచి పేరే సంపాధించుకుంది. అయితే మ‌హాన‌టి సినిమాతో కీర్తి సురేష్ లైఫ్ ట‌ర్న్ అయిపోయింది. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమా ఆమెకు టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఈ సినిమాతో ఒక్కసారిగా తెలుగులోనే కాదు దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది.

మ‌రియు ఆ సినిమాతో ఈ భామకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. అయితే ఈ మ‌హ‌న‌టి కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి కూతురు కాబోతున్నదనే ప్రచారం దక్షిణాది మీడియాలో ఊపందుకొన్నది. బీజేపీ పార్టీలో కీలకంగా కొనసాగుతున్న ఓ వ్యాపారవేత్త కుమారుడితో పెళ్లికి సంప్రదింపులు జరుగుతున్నాయని, ఆ సంబంధాన్ని ఖాయం చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తున్నది. తల్లిదండ్రులు చేస్తున్న ప్రయత్నాలకు కీర్తి సురేష్ కూడా సానుకూలంగా స్పందిస్తున్నట్టు తెలుస్తున్నది.

అలాగే పెళ్లి కుమారుడి తండ్రితో కీర్తీ తండ్రికి మంచి స్నేహపూర్వక సంబంధాలు ఉండటం కారణంగా ఈ పెళ్లి ఖాయమవుందని సినీ, రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. మ‌రి కీర్తి ఈ వార్త‌ల‌పై ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా, ప్ర‌స్తుతం కీర్తి ప్రస్తుతం తెలుగులో నితిన్‌తో రంగ్‌దే, త‌మిళంలో ర‌జినీకాంత్‌తో అణ్ణాత్త చిత్రాల్లో న‌టిస్తోంది.

కీర్తి సురేష్ కి పెళ్లి ఫిక్స్ .. వ‌రుడెవ‌రో తెలుసా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts