మృతదేహాలతో కేకులు, బిస్కెట్ల.. ఈ ఆంటీ యమ డేంజర్ గురూ..!!

April 4, 2020 at 8:40 am

ప్ర‌పంచంలో ఎన్నో దారుణాలు జ‌రుగుతూ ఉంటాయి. అయితే అందులో కొన్ని మాత్రం ఊహించ‌ని విధంగా.. అతి దారుణంగా ఉంటాయి. అలాంటి సంఘటనలు ఎన్నో చదివాం.. చూశాం. కానీ ఒక మహిళ మనుషులను దారుణంగా హత్య చేసి ఆ మృతదేహాలతో కేకులు, బిస్కెట్లు తయారుచేసి వాటిని ఇతరులకు తినిపించిన దారుణ సంఘటన ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఇటలీలోని కోరేజియోలో లియోనార్డా సియాన్సియుల్లి అనే మహిళ సబ్బులు, కేకుల తయారీలో మంచి పేరు సంపాదించింది. అలాగే, ఇరుగు పొరుగువారు సైతం ఆమెను ఎంతగానో ఇష్టపడేవారు.

అయితే ఓ రోజు లియోనార్డా తనకు ఎంతో సన్నిహితంగా ఉండే ఫౌస్టినా సెట్టీతో నీకు భర్తను వెతికే పనిలో ఉన్నా, ఇంటికి రావాలని చెప్పింది. ఆమె ఇంటికి వెళ్లి ఫౌస్టినాకు మత్తు మందు కలిపిన జ్యూస్ ఇచ్చింది. ఆమె మత్తులోకి జారుకున్న తర్వాత గొడ్డలితో శరీరాన్ని 9 భాగాలు చేసింది. పెద్దకుండలో వేసింది. అనంతరం 7 కిలోల కాస్టిక్ సోడాను అందులో వేసి శరీర భాగాలన్నీ పూర్తిగా ఉడికించింది. ఇక ఫౌస్టినా శరీరం నుంచి సేకరించిన రక్తాన్ని బాగా ఎండబెట్టింది. ఎండిన ఆ రక్తంతో పిండి, చక్కెర, చాక్లెట్, పాలు, కోడిగుడ్లు తదితరాలు కలిపి కేకు తయారు చేసింది.

ఆ రక్తంతో కరకరలాడే టీ కేక్స్ తయారు చేసింది. వాటిని ఆమె ఇంటికి వచ్చిన వారికి వడ్డించింది. వారు తినేలా చేసింది. అయితే ఆమె కూడా తినడం గమనార్హం. ఇక అదే ప్రాంతానికి చెందిన ఫ్రాన్సెస్కా సోవీ అనే మహిళను ఉద్యోగం ఇప్పిస్తాన‌ని చెప్పి హ‌త‌మ‌ర్చింది. కూడా ఫౌస్టినా తరహాలోనే చంపేసింది. మ‌రియు మూడో బాధితురాలు వర్జీనియా కాసియోప్పో. ఈమెను కూడా అలాగే చేసింది లియోనార్డా. అయితే ఈ ముగ్గురు బాధితుల కుటుంబ‌స‌భ్య‌లు పోలీసుల‌కు త‌మ పిల్ల‌లు క‌నిపించ‌డం లేద‌ని ఫిర్యాదు చేయ‌గా వారు రంగంలోకి దిగారు.

ఈ క్ర‌మంలోనే వారి కోసం తీవ్రంగా వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో అదృశ్యమైన మహిళల ఇళ్లల్లో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వారి ఇళ్లల్లో లియోనార్డ సియాన్సియుల్లికి సంబంధించిన లేఖలు కనిపించాయి. వాటిపై ఆమె అడ్రస్ కూడా రాసి ఉంది. ఈ అడ్ర‌స్ బ‌ట్టీ లియోనార్డా త‌మ‌దైన స్టైలో ఆరా తీయ‌గా అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టింది. ఇక అయితే ఈ హత్యోదంతాలు విన్న కోర్టు ఆశ్చర్యపోయింది. ఇన్ని చేసిన ఆమె ఏమాత్రం భయం.. బెరుకు లేకుండా నేరాలు అంగీకరించింది. అందుకే, ఆమెను అంతా ‘క్రేజీ సీరియల్ కిల్లర్ మదర్’ అని పిలుస్తున్నారు. ఇక ఆమె నేరానికి గాను కోర్టు ఆమెకు 30 ఏళ్లు జైలు శిక్ష విధించింది.

మృతదేహాలతో కేకులు, బిస్కెట్ల.. ఈ ఆంటీ యమ డేంజర్ గురూ..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts