‘దయచేసి మనుషుల్లా ప్రవర్తించండి’ అని టాలీవుడ్ హీరో ట్వీట్ !

April 6, 2020 at 12:58 pm

క‌రోనా వైరస్ మ‌హ‌మ్మారి వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా భారతీయుల్లోని ఐక్యతా భావాన్ని ప్రపంచానికి చాటేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. దీనిలో భాగంగా ఆదివారం (ఏప్రిల్‌5) రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు ఇళ్లలో లైట్లు అన్ని ఆర్పేసి దీపాలు, కొవ్వత్తులు, టార్చిటైట్లు, మొబైల్‌లలో ఫ్లాష్‌ లైట్లు వెలిగించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన దీప ప్రజ్వలనకు దేశం మొత్తం బాగానే స్పందించింది.

అందరూ తమకు వీలైన వాటిని వెలిగించారు. ఐకమత్యంగానే ఉన్నామని తెలిపారు. అయితే దీపాలు వెలిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెబితే కొన్ని చోట్ల‌ కొందరు మాత్రం బాణసంచా కాల్చారు. దీంతో పలు చోట్ల అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను చూసిన టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్ ఫైర్ అయ్యారు. ఓ నెటిజన్ బాణసంచా కాల్చ‌డం వ‌ల‌న తమ ఇంటి ప‌క్క‌న భారీ అగ్ని ప్ర‌మాదం జ‌రిగింద‌ని చెప్పాడు.

దీనిపై మనోజ్‌ స్పందిస్తూ.. ‘కొందరు బాణసంచా కాల్చుతున్నారు. ఇలా చేయాలని వారిని ఎవరూ అడగలేదు.. దయచేసి మనుషుల్లా ప్రవర్తించండి’ అని మనోజ్ ట్వీట్ చేశాడు. ‘ఈ క్రాకర్స్‌ కాల్చడం చూస్తుంటే మన వాళ్లు కరోనాని కూడా సీఎంని లేదా పీఎంని చేసేలా ఉన్నారు. తికమకపెడుతున్నారు.. జై కరోనా అని కూడా అంటున్నారు’ అని ఎద్దేవా చేశాడు మ‌నోజ్‌.

‘దయచేసి మనుషుల్లా ప్రవర్తించండి’ అని టాలీవుడ్ హీరో ట్వీట్ !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts