సినీ కార్మికుల కోసం నయనతార భారీ విరాళం..!!

April 4, 2020 at 2:41 pm

ప్ర‌స్తుతం క‌రోనా టైమ్ న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్ క్ర‌మంగా ప్ర‌పంచ‌దేశాల‌ను క‌మ్మేసి.. ప్ర‌జ‌ల‌ను అత‌లా కుత‌లం చేస్తోంది. భార‌త్‌లో సైతం క‌రోనా రోజురోజుకు వేగాన్ని పెంచుకుంటోంది. అయితే దేశాన్ని గడగడలాడిస్తున్న కరోనాను కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే లాక్ డౌన్ సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజలను ఇల్లుదాటి బయటకు రాకుండా చూస్తూ కరోనా వ్యాప్తిని నిరోధిస్తున్నాయి.

అయితే ఈ క‌రోనాతో పోరాడ‌డానికి సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు మ‌రియు వ్యాపార‌వేత్త‌లు సైతం త‌మ వంతు సాయం చేయ‌డానికి ముందుకు వ‌స్తున్నారు. అలాగే లాక్ డౌన్ కారణంగా చిత్ర పరిశ్రమ కార్యకలాపాలు స్థంభించిపోయాయి. దాంతో చాలామంది కార్మికులు ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్ర‌మంలోనే వీళ్ల‌కు సినీతార‌లు సాయం చేస్తున్నారు. తాజాగా లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార కూడా అదే చేసింది.

సినీ కార్మికుల కోసం హీరోయిన్లు ఎవరూ స్పందించడంలేదన్న విమర్శల నేపథ్యంలో, ప్రముఖ నటి నయనతార తనవంతు విరాళం ప్రకటించింది. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఎక్కడికక్కడ షూటింగులు నిలిచిపోయాయి. దాంతో సినీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు ఉపాధి కరవైంది. ఈ నేపథ్యంలో, దక్షిణాది సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ)కు నయనతార రూ.20 లక్షల విరాళం అందించింది.

సినీ కార్మికుల కోసం నయనతార భారీ విరాళం..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts