ప‌వ‌న్ సినిమాలో ఈ తెలుగు బ్యూటీ… ఏ పాత్ర‌లో అంటే?

April 4, 2020 at 11:06 am

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాక రాక రెండేళ్ళ గ్యాప్ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న విష‌యం తెలిసిందే. వ‌కీల్‌సాబ్ చిత్రంతో రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రం షెడ్యూల్ కొంత వ‌ర‌కు పూర్త‌యింది. మిగ‌తాది కారోనా కార‌ణంగా అంద‌రూ లాక్‌డ‌వున్ పాటిస్లున్న నేప‌ధ్యంలో బ్రేక్ వ‌చ్చింది. ఇక ఇదిలాఉంటే క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో భారీ చిత్రం ప్రారంభ‌మ‌వుతుంది. ఈ చిత్రం భారీ పీరియాడిక్ డ్రామాగా తెర‌కెక్కుతోంది. ఇక ఈ విష‌యం ప‌క్క‌న పెడితే… ఇందులో ఓ స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించడానికి మ‌న తెలుగ‌మ్మాయి పూజిత పొన్నాడ రెఢీ అయిపోతుంద‌ట‌.

క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న భారీ పీరియడ్ డ్రామాలో స్పెషల్ సాంగ్ కోసం ఆమెను సంప్ర‌దించినట్లు స‌మాచారం. ఓ భారీ సెట్ లో ఇప్పటికే ఈ సాంగ్ చిత్రీకరణ పూర్తయిందని సమాచారం. పూజిత గతంలో రాజశేఖర్ హీరోగా వచ్చిన కల్కి చిత్రంలో న‌టించిన విష‌యం తెలిసిందే. అలాగే రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలం మూవీలో ఆది పినిశెట్టి లవర్ గా క‌నిపించి ప్రేక్ష‌కుల‌ను ఆక్టుకుంది. పవన్ లాంటి స్టార్ హీరో పక్కన సాంగ్ చేసే అవకాశం దక్కించుకున్న ఈ బ్యూటీ కెరీర్ కి ఇది కలిసొచ్చే అంశమే.

ఇక ఈ చిత్రానికి విరూపాక్ష అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహాలో సాగే బందిపోటు పాత్ర చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. సీనియర్ ప్రొడ్యూసర్ ఏ ఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. మ‌రి ప్ర‌స్తుతం కరోనా వైరస్ అంద‌రినీ వ‌ణికిస్తున్న నేప‌ధ్యంలో షూటింగ్‌కి కాస్త బ్రేక్ దొరికింద‌ని చెప్పాలి.

ప‌వ‌న్ సినిమాలో ఈ తెలుగు బ్యూటీ… ఏ పాత్ర‌లో అంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts