ఆ విష‌యంలో షారుఖ్ ఖాన్ కేక అంటున్న పూజా హెగ్డే..!!

April 4, 2020 at 12:29 pm

పూజా హెగ్డే.. ప్ర‌స్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. తమిళ చిత్రం ముగమూడి తో 2012లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే. మిస్కిన్‍ దర్వకత్వంలో రూపొందిన ఈ చిత్రం పరాజయం పాలవ్వడంతో కోలీవుడ్‍లో మరో అవకాశాన్ని దక్కించుకోలేకపోయింది ఈ కన్నడ సోయగం. అయితే ముకుంద సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటి అతి త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోయిన్‌గా కొన‌సాగుతోంది. తెలుగులో అగ్ర హీరోలందరి సరసనా అవకాశాలు దక్కించుకుంటూ టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది.

ఇటీవల అల వైకుంఠపురములో సినిమాలో మెరిసిన పూజా హెగ్డే.. కనిపిస్తే చాలు ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిపోతుంది అనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కార‌ణంగా స‌మాన్యుల‌తో పాటు సినీతార‌లు కూడా ఇంటికే ప‌రిమితం అయ్యారు. ఈ క్ర‌మంలోనే పూజా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించింది. ఈ క్ర‌మంలోనే ఓ నెటిజన్ ప్రశ్న అడుగుతూ.. మీరు షారుఖ్ ఖాన్ గురించి ఏమనుకుంటున్నారు? అని అడిగారు.

పూజా దానికి సమాధానం ఇస్తూ… షారూక్ కింగ్ అఫ్ రొమాన్స్ అని తెలిపింది. అందులో ఆయ‌న కేక అంటోంది. అలాగే బాలీవుడ్ హీరోల్లో హృతిక్ రోషన్ అంటే ఇష్ట‌మ‌ని చెప్పుకొచ్చింది. మనిషి .. మనసు రెండూ అందంగా ఉండటం అరుదుగా జరుగుతుంటుంది. అలా అందమైన మనసున్న మనిషిగా హృతిక్ రోషన్ కనిపిస్తాడు. కాగా, ప్ర‌స్తుతం పూజా అనేక ఆఫ‌ర్ల‌తో చాలా బిజీగా కొన‌సాగుతోంది.

ఆ విష‌యంలో షారుఖ్ ఖాన్ కేక అంటున్న పూజా హెగ్డే..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts