`ఆర్ఆర్ఆర్`ను మించి ఉండ‌నున్న‌ ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా..!!

April 20, 2020 at 12:32 pm

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌.. ప్ర‌స్తుతం జిల్ ఫేమ్‌ రాధాకృష్ణ తెర‌కెక్కిస్తున్న చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను యూరప్ నేపథ్యంలో 1970-80ల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమా త‌ర్వాత మహానటితో జాతీయ అవార్డును దక్కించుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్‌తో కలిసి పనిచేయబోతున్నారు ప్రభాస్. వైజయంతి మూవీస్ సంస్థ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవ‌ల‌ ఈ గుడ్ న్యూస్‌ను ప్రకటించింది.

వైజయంతి మూవీ అధినేత అశ్విని దత్ సినిమాను నిర్మించనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబడుతున్న ఈ సినిమా అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో నాగ్ అశ్విన్ బిజీ గా ఉన్నారు. అలాగే ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కనుంది అని తెలుస్తుంది. మ‌రోవిష‌యం ఏంటంటే.. సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కే ఈ సినిమా కాలంలో ప్రయాణించడం అనే కథాంశంతో తెరకెక్కనుందట.

నాగ్ అశ్విన్ కి బాగా ఇష్టమైన ఆదిత్య 369 సినిమాలో లాగే ఈ సినిమాలోనూ ప్రభాస్ కాలంలో ముందుకీ, వెనక్కీ వెళతాడట. అంతేకాకుండా.. ఆర్ఆర్ఆర్ బ‌డ్జెట్‌ను మంచి ఈ సినిమా బ‌డ్జెట్ ఉండ‌నున్న‌ట్టు తెలుస్తుంది. స్ప‌ష్టంగా చెప్పాలంటే.. ఈ సినిమాను 500 కోట్ల బడ్జెట్ తో తీయనున్నారు అని సమాచారం. కాగా, ఈ ఏడాది చివర్లో సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని, 2021 చివర్లో సినిమాను రిలీజ్ చేస్తామని అశ్విన్ ఇప్ప‌టికే తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే.

`ఆర్ఆర్ఆర్`ను మించి ఉండ‌నున్న‌ ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts